16 ఎంపీ సీట్లు..గులాబీ పార్టీకే..

Tue,March 19, 2019 02:03 AM

లింగాలఘనపురం, మార్చి 18: దేశానికి కాబోయే ప్రధాని, దేశ్‌కీ నేత సీఎం కేసీఆరేనని ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య అన్నారు. మండల కేంద్రంలో ఆ యన సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెం బ్లీ, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఎంపీ ఎన్నిక ల్లో సైతం అదే ఊపుతో 16 సీట్ల ను గు లాబీమయం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అ భ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. విధేయులుగా ఉండి కష్టించిన ప్ర తీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, రా బోయే రోజుల్లో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా అవకాశం కలుగుతుందన్నారు. పార్టీలో ఉంటూ గ్రూపులు కట్టి ద్రోహం చేయాలనుకునేవారు ఎంత టి వారైనా సరే ఉపేక్షించమని, పార్టీ ప రంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యకర్తలంతా సమష్టిగా శ్రమించి ఎంపీ ఎన్నికలో పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని కార్యకర్తలకు ఎమ్మెల్యే పి లుపు నిచ్చారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్, జెడ్పీటీసీ గంగసాని రంజిత్‌రెడ్డి, రైతుసమన్వయసమితి మండల కోఆర్డినేటర్ బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, నాయకు లు బోయిని రాజు, చిట్ల ఉపేందర్‌రెడ్డి, దుంబాల భాస్కర్‌రెడ్డి, ఏదునూరి వీర న్న, గండి యాదగిరి, గవ్వల మల్లేశం, చౌదరపెల్లి శేఖర్, కేమిడి వీరసాయిమల్లేశ్, మర్రి భాస్కర్‌రెడ్డి, ఉడుగుల భాగ్యలక్ష్మి, కేమిడి కవిత, ఎలీషా , లింగాల వెంకటేశ్ పాల్గొన్నారు. కాగా మండలంలోని వడిచర్ల ఎంపీటీసీ రేగు అంజయ్య కుమారుడు రేగు అశోక్ ఈ నెల 6 న మృతి చెందగా ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles