పథకాలను చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు

Tue,March 19, 2019 02:02 AM

నర్మెట, మార్చి 18: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, వారందరికీ స్వాగతిస్తున్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. సోమవారం జనగామ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్మెట మండలంలోని గండిరామవరం గ్రామ సర్పంచ్ జ్వాల శ్వేతకిషన్‌తో పాటు ఉపసర్పంచ్ మిడిదొడ్డి మల్లయ్య, వార్డు సభ్యులు గద్దల చిన్న వెంకటయ్య, జ్వాల స్వప్న, సత్తమ్మ, బొడికె నవిత, భూక్య రాజ్‌కుమార్, మార్క గట్టయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు వేముల అంజయ్య, బొక్కెర కొమురయ్య, నాగరా జు, గద్దల రవి, కుమార్, తుప్పుడు నాగేశ్వర్, చెవుల క నకయ్యతో పాటు 20 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ము త్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి గులాబీ కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ పెద్ది రాజిరెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ బావండ్లపల్లి భూమాత రాజు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు అమెడపు కమలాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు భూక్య శ్రీనివాస్, కంతి హేమలత రాజలింగం, లకావత్ కిరణ్, గద్దల విజయ్‌కుమార్, మటూరు రమేశ్, ఇట్టబోయిన రమేశ్, నెరటి సుధాకర్, జయరాంనాయక్, గద్దల అమృతరావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles