న్యాయవాదులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి


Tue,March 19, 2019 02:02 AM

-రిటైర్డ్ జస్టిస్ చంద్రయ్య
జనగామ టౌన్, మార్చి 18: న్యాయవాదులు తమ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందిచుకుంటూ ముందుకు సాగాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రయ్య అన్నారు. సోమవారం జిల్లాకు వచ్చిన రిటైర్డ్ న్యాయమూర్తికి జనగామ అడ్వకేట్ బార్ అసోసియేషన్ మెంబర్స్ ఘన స్వాగతం పలికి శాలువలతో సత్కరించారు. అనంతరం జనగామ బార్ అసోసియేషన్ హాల్‌లో ఏర్పాటు చేసిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ సీనియర్ న్యాయవాదులు సుధీరంజన్, వి ప్రసాదరావు, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి నారాయణబాబు, సీనియర్ సివిల్ జడ్జీ ఉమాదేవి, జూనియర్ సివిల్ జడ్జి అజయ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మంచాల రవీందర్, తెలంగాణ న్యాయవాదుల ఫోరం అధ్యక్షుడు సాయిబాబా, ఎనివాస్, కేమిడి చంద్రశేఖర్, రాజశేఖర్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

47

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles