అమ్మాపురంలో లోవోల్టేజీతో సామగ్రి దగ్ధం

Tue,March 19, 2019 02:02 AM

నర్మెట, మార్చి 18: లోవోల్టేజీతో పలు ఇళ్లలోని సామగ్రి దగ్ధమైన ఘటన మండలంలోని అమ్మాపురం గ్రామంలో సోమవారం చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో విద్యుత్ లోవోల్టేజీతో సరఫరా కావడంతో పలు ఇండ్లల్లో విలువైన వస్తువులు దగ్ధమయ్యాయన్నారు. గ్రామానికి చెందిన బండి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో లోవోల్టేజీ కరంటు సరఫరా కావడంతో ఇంట్లో ఎల్‌ఈడీ టీవీతో పాటు పలు డబుల్‌బెడ్ పరుపులు, పలు విలువైన పరికరాలు దగ్ధమయ్యాయి. అదేవిధంగా ఇర్రి గాల్‌రెడ్డి ఇంట్లో టీవీ సెట్ టాప్ బాక్స్‌తో పలు ఇండ్లల్లో విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమయ్యాయని బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కుంటి జగన్, గ్రామస్తులు బైరగోని రవీందర్‌గౌడ్, ఇర్రి గాల్‌రెడ్డి తదితరులు బాధిత కుంటుబాలను పరామర్శించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరాను నిలిపి వేయించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు. వారి వెంట ఆంగన్‌వాడీ టీచర్లు బండి తార, రాంబాయి తదితరులు ఉన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles