రేణుక ఎల్లమ్మ ఆలయాభివృద్ధికి కృషి చేస్తా

Mon,March 18, 2019 01:20 AM

-మాజీ డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ : భక్తి శ్రద్ధలతో పండుగలను జరుపుకోవాలని మాజీ డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం చిల్పూర్‌లో ఈ నెల 30న రేణుక ఎల్లమ్మదేవి, కంఠమహేశ్వరస్వామి వారి ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, పాటుపడుతుందన్నారు.
రేణుక ఎల్లమ్మదేవి ఆలయాభివృద్ధికి తమ స్వంత నిధులతో రూ.10లక్షలు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, ఎంపీపీ వంగాల జగన్మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ భూక్య స్వామినాయక్, నియోజకవర్గ ప్రతినిధి బెల్ది వెంకన్న, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ జనగాం యాదగిరి, ఎంపీటీసీ మాచర్ల ప్రవీణ్, జిల్లా జాగృతి నాయకులు నారగోని రవిచంద్ర, సట్ల లింగయ్య, నారగోని వెంకన్న, నారగోని శ్రీనివాస్, నారగోని రాజు, పొన్నం శ్రీను, పొన్నం కుమార్, పంతం రాజు, జీ రమేశ్, మోడం విజయభాస్కర్, గోపగోని రమేశ్, సట్ల రమేష్, బాల్నె రవి తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles