ఓరుగల్లును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

Mon,March 18, 2019 01:20 AM

-తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం
-ప్రజల జీవన శైలిని కెమెరాల్లో బంధించాలి : కలెక్టర్ పీజే పాటిల్
-హరితహోటల్‌లోఫొటో కన్వెన్షన్ ప్రారంభం
-మరో రెండు రోజులు కొనసాగింపు
సిద్ధార్థనగర్, మార్చి 17: వరంగల్ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. హన్మకొండలోని హరిత హోటల్‌లో తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఫొటో కన్వెన్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశం వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌తో కలిసి ఫొటోగ్రాఫర్లు కుసుమ ప్రభాకర్, మధుగోపాల్, అరవింద్ ఆర్య ఐదు నుంచి పదేళ్ల కాలంలో పురాతన కాలం నాటి ఫొటోలు తీసి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి రాజన్ స్కూల్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఫౌండర్, 1989లో ఫొటోగ్రఫీ ఫెలోషిప్ ఆఫ్ సొసైటీ మొదటి బహుమతి అందుకున్న రాజన్‌బాబు, ఏపీ స్టేట్ అకాడమీ ఫొటోగ్రఫీ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్(ఏపీఎస్‌ఎపీ) డాక్టర్ ఎన్ భగవాన్‌దాస్, ఫౌండర్ సెక్రటరీ ఆఫ్ ఎపీ స్టేట్ అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ రాజుబహుదూర్ ఫొటోలకు పూలదండ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్నారు.

కాకతీయుల కాలంలో కట్టిన 45 వేల చెరువులు నేటికీ ఉపయోగపడుతున్నాయని, వాటన్నింటిపీ భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. సింగపూర్ లాంటి చిన్నచిన్న దేశాలు పర్యాటకంగా అభివృద్ధి చెందాయని, వరంగల్ నగరానికి కూడా ఆ తరహా అవకాశం ఉందన్నారు. విదేశీయులు మన గొప్పతనాన్ని మనకు చెప్పేంత వరకూ తెలియడం లేదన్నారు. మన దేశంలో పర్యాటక ప్రాంతాలకు తక్కువగా సందర్శిస్తారని, 100 కోట్లపైన జనాభా ఉంటే అందులో కేవలం కోటి మంది మాత్రమే విమాన ప్రయాణాలు చేస్తున్నారని అన్నారు. పర్యాటక అభివృద్ధి మూలంగా హోటల్, రవాణా రంగాల్లో వేలాది ఉద్యోగాలు వస్తాయని, అందుకు మన వారసత్వ సంపద, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ఇలాంటి ఫొటోగ్రఫీ కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ మాట్లాడుతూ వరంగల్ నగరానికి వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉందని, ఇటువంటి నగరంలోని కట్టడాలను, ప్రజల జీవన శైలిని ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించాలని ఆయన కోరారు. అలాంటి కార్యక్రమాలు వరంగల్ నగరంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ నిర్వాహకులను ఆయన అభినందించారు. అకాడమీకి కావాల్సిన సహాయ సహకారాలను అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles