సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలకు పూర్వ వైభవం.

Mon,March 18, 2019 01:19 AM

లింగాలఘనపురం : సీఎం కేసీఆర్ చొరవతోనే రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మండలంలోని నెల్లుట్ల శ్రీరామలింగేశ్వర దేవాలయంలో ఆదివారం జరిగిన పంచముఖ గణపతి విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రసంస్కృతి, సంప్రదాయాలకు గ్రామదేతలు చిహ్నాలుగా నిలుస్తాయన్నారు. ఆధ్యాత్మిక భావాలను పుణికిపుచ్చుకున్న సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. త్వరలో తెలంగాణలో తప్పకుండా కోటి ఎకరాలకు సాగునీరు అందజేస్తామన్నారు. అందుకే కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల పనులు వడివడిగా అడుగులు వేస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ రైతుల శ్రేయస్సు కోసం చేబడుతున్న పథకాలు దేశం మొత్తానికి విస్తరించనున్నాయన్నారు. జనగామ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న నెల్లుట్ల గ్రామం పల్లె నుంచి పట్టణంగా రూపుదిద్దుకుంటోందన్నారు. నెల్లుట్ల గ్రామం గ్రామదేవతల దీవెనలతో అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. పూజలో దేశగురువు విజయభాస్కర్‌రెడ్డి, సంపత్‌కుమార కృష్ణమాచార్యులు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగేందర్, ఎంపీటీసీ వాణేశ్వరి, ఉపేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజేశ్వర్, రాజు, వీరస్వామి, రాజు, కొత్తకొండ గంగాధర్, మర్రి భాస్కర్‌రెడ్డి, ఉడుగుల భాగ్యలక్ష్మి, రాంచందర్, సత్తయ్య, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

తిరుమలనాథ స్వామి దేవాలయంలో ధ్వజారోహణం
స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్ : మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీతిరుమలనాథ స్వామి ఆలయంలో ఆదివారం ధ్వజారోహణ పూజలను నిర్వహించారు. అర్చకులు శేషాచార్యులు, రామానుజచార్యులు, నరేశ్‌శర్మ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అష్టోత్తరశతనామార్చన, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ఠాపనం పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. వేడుకలో ఉత్సవ కమిటీ చైర్మన్ రంగాచార్యులు, వైస్ చైర్మన్లు ప్రభాకర్‌రెడ్డి, వెంకన్న, ప్రధాన కార్యదర్శి గట్టయ్య, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి రవీందర్, సభ్యులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles