ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి

Mon,March 18, 2019 01:19 AM

జనగామ రూరల్, మార్చి17 : గ్రామాల్లో లోక్‌సభ ఎన్నికలను గ్రామస్తులు ప్రశాంతగా నిర్వహించుకోవాలని సీఐ మల్లేశ్‌యాదవ్ గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని ఎల్లంల, సిద్దెంకి గ్రామాల్లో గ్రామస్తులకు ఎన్నికల కోడ్‌పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో గ్రామాల్లో ఎలాంటి అనుమతి లేని ర్యాలీలు, ప్రచారం, సభలు నిర్వహించవద్దన్నారు. అనుమతి తీసుకొని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచారం అనుమతి సమయంలోపు నిర్వహించుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై భూక్య రాజేష్‌నాయక్, సర్పంచులు ఎర్ర సుజాత, సుంకరి నిర్మల, ఎంపీటీసీ దూవునూరి చంద్రయ్య, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles