రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్‌లకు సన్మానం

Mon,March 18, 2019 01:18 AM

జనగామ రూరల్/దేవరుప్పుల, మార్చి 17: రెడ్డి సామాజిక వర్గం నుంచి గెలుపొందిన సర్పంచ్‌లను జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెనుకబడిన రెడ్డి కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో రెడ్డి సంక్షేమ భవనం నిర్మించిన శత్రుజ్ఞారెడ్డికి ముత్తిరెడ్డి పాదాభివందనం చేశారు. అనంతరం నూతన సర్పంచ్‌లను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు చాడ వెంకట్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గొట్టం తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మోతె రవీందర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన వారిలో దేవరుప్పుల సర్పంచ్ ఈదునూరి రమాదేవి, కామారెడ్డిగూడెం సర్పంచ్ బిళ్ల అంజమ్మ, కడవెండి సర్పంచ్ పోతిరెడ్డి బెత్లినాలీనారెడ్డి, పెదమడూరు సర్పంచ్ ఆకవరం సుజానారెడ్డి, నీర్మాల సర్పంచ్ మలిపెద్ది శ్రీనివాసరెడ్డి, సింగరాజుపల్లి ఉపసర్పంచ్ కొండ చినబుచ్చిరెడ్డి సన్మానం పొందిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు జనగాం సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles