పది పరీక్షలు షురూ..

Sun,March 17, 2019 01:14 AM

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 16: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 41 కేంద్రాల్లో 7498 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, తొలిరోజు 7482 మంది విద్యార్థులు(99.79 శాతం) హాజరయ్యారు. 16 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి, డీఈవో ఎస్ యాదయ్య, అసిస్టెంట్ కమిషనర్ (ఎగ్జామ్స్), ఫ్లయింగ్, సిట్టింగ్ స్వాడ్‌లు, చీఫ్ సూపరింటెండెంట్లు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు మొత్తం కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యాశాఖ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు నిమిషం నిబంధనను పాఠశాల విద్యాశాఖ ఐదు నిమిషాలకు సడలించడంతో విద్యార్థులు సాఫీగా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థినీ విద్యార్థులు బారులు తీరి కనిపించారు.

టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి
జనగామలోని ప్రెస్టన్ హైస్కూల్‌తోపాటు పట్టణంలోని పలు కేంద్రాలను కలెక్టర్, డీఈవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎలాంటి సమస్య ఎదురైనా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు టోల్‌ఫ్రీ నంబర్ 1950కు ఫోన్ చేయాలని సూచించారు. మాస్‌కాపీయింగ్ జరగకుండా పోలీసులు సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. కాగా, పరీక్ష కేంద్రాలకు నిర్ణీత దూరంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్న నిబంధన అమలు కాకపోవడంతో పోలీసులు నిర్వాహకులను పిలిచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పట్టణంలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఉండకూడదని, జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు మూసి వేయాలని పోలీసులు ఆదేశించారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles