ఓటరు జాబితాలో పేర్లు చూసుకోవాలి

Sun,March 17, 2019 01:13 AM

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 16 : ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చూసుకో వాలని, 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడు తప్పనిసరి ఓటు హక్కు కలిగి ఉండాలని స్వీప్ నోడల్ అ ధికారి కేఆర్ లత అన్నారు. శని వారం జనగామలోని శ్రీ విద్య డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు లోక్‌సభ ఎన్నికలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవీఎంల వినియోగం, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అంశాలపై అవగాహన కల్పించి మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనకు పాల్పడే రాజ కీయపార్టీలపై సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఓటుహక్కు, జాబి తాలో పేర్ల పరిశీలన, హెల్ప్‌లైన్, కొత్త ఓటరు నమోదు, ఓటింగ్ యంత్రాలపై ఓటు వేసే విధానం వంటి అంశాలపై మైన్స్ ఏడీ రామాచారి అవగాహన కల్పించారు. కా ర్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles