ప్రమాదాల నివారణకు చర్యలు

Sun,March 17, 2019 01:13 AM

బచ్చన్నపేట : మండలంలోని గోపాల్‌నగర్(కేసీఆర్ చౌరస్తా) సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని బచ్చన్నపేట ఎస్సై రంజిత్‌రావు అన్నారు. అందులో భాగంగానే శనివారం సాయంత్రం ఆలేరు రోడ్డు, చౌరస్తా నుంచి చిన్నరామన్‌చర్లకు వెల్లే రోడ్డుకు స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు వెడల్పు పనులు చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు అతి వేగంతో నడిపి నిండు జీవితాలను బలి చేసుకోవద్దని ఆయన సూచించారు. వాహనాలు నడిపే వారందరూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. అతివేగంతో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రోడ్డుప్రమాదాల్లో ఇప్పటి వరకు దుర్మరణం పాలైన వారందరూ తలకు తీవ్ర గాయాలై మరణించిన వారే ఉన్నారని, అందుకే ద్విచక్ర వాహనం నడిపేవారంతా విధిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. ఆయన వెంట గోపాల్‌నగర్ సర్పంచ్ పర్వతం మధుప్రసాద్, టీఆర్‌ఎస్ నాయకులు గిరబోయిన అంజయ్య, బాలసిద్దులు, తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles