పోలీస్ భద్రత నడుమ ఇళ్ల కూల్చివేతలు

Sun,March 17, 2019 01:12 AM

రఘునాథపల్లి : జాతీయ రహదారి 163 ఫోర్‌లైన్ విస్తరణ పనుల్లో భాగంగా నిడిగొండ వద్ద రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో, పోలీసుల భద్రత నడుమ వివాదం నెలకొన్న ఇళ్ల కూల్చివేత పనులను ఎల్‌అండ్‌టీ సంస్థ చేపట్టింది. శనివారం ఆర్డీవో మదన్‌మోహన్, తహసీల్దార్ తిరుమలచారి, సీఐ చంద్రశేఖర్‌గౌడ్, ఎస్సై వేణుగోపాల్, వీఆర్వోలు, అక్కడికి చేరుకుని కూల్చివేత పనులను ప్రారంభించారు. రాయగిరి వరకు ఉన్న బైపాస్ రోడ్డుకు అనుసంధానంగా నాలుగు లేన్లుగా చేపట్టిన బైపాస్ విస్తరణలో నిడిగొండ వద్ద రెండు ఇళ్లకు పరిహారం తక్కువ వచ్చిందని కొన్నాళ్లుగా నిర్వాసితులు పనులు అడ్డుకుంటున్నారు. మరింత పరిహారం తమకు వచ్చాకే కూల్చివేయాలని అభ్యంతరం తెలుపుతూ వచ్చారు. అదనంగా పరిహారం ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పడంతో ఈ వివాదం ఇప్పటి వరకు నలుగుతూ వచ్చింది. ఫలితంగా ఇక్కడ విస్తరణ పనులు పూర్తిగా నిలిచిపోవడంతో కొన్ని గ్రామాలకు బస్సు సర్వీసులు రద్దుకావడం, ప్రమాదాలు జరుగుతుండటంతో ఎల్‌అండ్‌టీ సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈమేరకు కలెక్టర్ ఆ రెండు ఇళ్లను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో శనివారం పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో కూల్చివేతలను చేపట్టారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles