ఘనంగా ధ్వజారోహణం

Sun,March 17, 2019 01:12 AM

స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తే తెలంగాణ మార్చి 16: చిలుపూరు మండలకేంద్రంలోని శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి, పద్మావతి, అలువేలు మంగమ్మ కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి శనివారం గరుడపటాన్ని అర్చకులు ఘనంగా ధ్వజారోహణం చేశారు. ముందస్తుగా యాగశాల ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి వారికి, ఉత్సవమూర్తులకు 108 కలశాలతో పంచామృత అభిషేకం చేశారు. తర్వాత గరుత్మంతుడిని ధ్వజారోహణం చేయించడానికి గరుత్మంతుడికి చిత్రపటం ఎదుట అర్చకులు వంశీధారచార్యులు, శ్రీధరాచార్యులు, రంగాచార్యులు, కిశోరచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గరుడ ముద్దలను ఆకాశంలోకి విసిరివేయగా భక్తులు వాటిని అందుకొని ఆరగించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శ్రావణకుమారాచార్యులు మాట్లాడుతూ మానవులు చేసిన పాపకార్యాలను తొలగించడానికి పంచభూతాల సాక్షిగా గరుడముద్దలను ఎగరవేస్తారన్నారు. ముక్కోటి దేవతలు గరుడ ముద్దలను ఆశీర్వదిస్తారని వివరించారు. గరుడ ముద్దలు అందకున్న భక్తులు వాటని ఆరగిస్తే కష్టాలు తొలగిపోతాయాని చెప్పారు. ముఖ్యంగా నాగదోషాలు, స్వర్పదోషాలు తొలగిపోతాయన్నారు. అనంతరం భేరిపూజ, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు భక్తజనసందోహాల మధ్య ఎదురుకోళ్లను వేదమంత్రోచ్ఛారణలతో వైభవంగా నిర్వహించారు. అర్చకులు కిరణకుమారాచార్యులు, లక్ష్మీనర్సింహాచార్యులు, శ్రీనివాసచార్యులు, వెంకటరమణచార్యులు, లలిత ప్రసాద్ శర్మ, రవీందర్ శర్మ, సిబ్బంది రమేశ్, వీరన్న, మహేశ్, మల్లికార్జున్, శేఖర్ పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles