విద్యార్థులూ భయం వద్దు.. ఆల్ ద బెస్ట్

Sat,March 16, 2019 01:34 AM

- ప్రశాంతంగా పరీక్షలు రాయండి
- వందశాతం ఫలితాలు సాధించాలి..
- సివిల్ డ్రెస్‌లో వస్తేనే కేంద్రంలోకి అనుమతి
- ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావొద్దు..
- అన్ని సబ్జెక్టులకు ఓఎంఆర్ షీట్లు..
- జిల్లాలో 41 సెంటర్ల ఏర్పాటు
- నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
- నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో డీఈవో యాదయ్య

జనగామ, నమస్తే తెలంగాణ : పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పకడ్బందీగా పరీక్షల నిర్వహణ, వేసవి దృష్ట్యా తీసుకుంటున్న చర్యలు, విద్యార్థులకు ఇచ్చే సూచనలు తదితర అంశాలపై శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు..

నమస్తే తెలంగాణ: పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..?
డీఈవో : జిల్లా వ్యాప్తంగా 41 సెంటర్లను ఏర్పాటు చేశాం. వీటిలో 40 రెగ్యులర్, ఒక ప్రైవేట్ కేంద్రంలో మొత్తం 7,644 మంది పరీక్షలు రాయనున్నారు. అందులో 3,677 మంది బా లురు, 3,816 మంది బాలికలు, 151మంది సప్లిమెంటరీ వి ద్యార్థులు ఉన్నారు. అన్నిశాఖల సమన్వయంతో ఇప్పటికే ఆ యా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా తనిఖీలు చేస్తాం.

నమస్తే: ఉత్తమ ఫలితాల కోసం ఏం చేశారు..?
డీఈవో : పాఠ్యాంశాల్లోని సిలబస్‌ను ముందస్తుగానే పూర్తిచేశాం.. ప్రతీ మండలంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి 30 రోజుల పాటు విద్యార్థులకు భోజన, వసతి కల్పించి సమ్మెటివ్ పరీక్షల్లో వెనుకబడిన వారిని గుర్తించాం. ఈ గ్రేడ్ విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించడం, సాయంకాలంలో నిష్టాతులైన సబ్జెక్టు నిపుణులను నియమించి అన్ని విషయాలపై నైపుణ్యాలను అందించాం. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు అమలు చేశాం.

నమస్తే: విద్యార్థులకు ఇచ్చే సలహాలు..?
డీఈవో : పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్.. ఎవరూ ఎలాంటి పుకార్లు నమ్మద్దు. కష్టపడి.. ఇష్టంగా చదివితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ప్ర శాంతమైన మనస్సుతో పరీక్షలకు హాజరుకావాలి. మనస్సులో ఏ చిన్న టెన్షన్‌కు తావులేకుండా ముందుగానే సెంటర్‌కు చేరుకోవాలి. తనిఖీ బృందం ఎప్పుడైనా కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటారు. పరీక్ష ముగిసే వరకూ జాగ్రత్తగా..అప్రమత్తంగా ఉండాలి.

నమస్తే: జవాబు పత్రం, ఓఎంఆర్ షీట్‌పై ఏం రాయాలి..?
డీఈవో : పరీక్ష ప్రారంభ సమయాని కంటే 45 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష హాల్‌లోకి వెళ్లిన తర్వాత విద్యార్థి ప్రధాన జవాబు పత్రాన్ని సరైన సమాచారంతో నిం పడం, ఓఎంఆర్‌లు శ్రద్ధగా చదివి తప్పులుంటే ఆ సమాచారా న్ని సంబంధిత పర్యవేక్షకులకు తెలపాలి. పిన్ చేసి స్టిక్కర్లు వే యడం, ఉదయం 9.30 గంటలకు ప్రశ్న పత్రం అందుకొని సూచనలు చదివి జవాబు రాయాలి. ప్రధాన జవాబుపత్రం సం ఖ్యనే అదనపు జవాబు పత్రంపై, మ్యాప్, గ్రాఫ్‌లపై రాయడం, పూర్తయిన వెంటనే పూర్తి అదనపు పత్రాల సంఖ్యను ఓఎంఆర్‌పై రాయాలి. పరీక్ష రాసే ప్రతి విద్యార్థి ఫొటోతో సహా ఓఎంఆర్ షీట్ జంబ్లింగ్ ద్వారా వస్తుంది. గైర్హాజరైన విద్యార్థికి సం బంధించిన ఓఎంఆర్ జంబ్లింగ్ షీట్ అతడి ఫొటోతో ఉంటుంది కనుక అలానే పక్కకు పెడుతారు.

నమస్తే: వేసవి దృష్ట్యా తీసుకున్న చర్యలు..?
డీఈవో : వేసవి దృష్ట్యా విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ప్రతీ కేంద్రంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్య లు తీసుకున్నాం. వైద్యశాఖ సహకారంతో ప్రతీ పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్‌ఎం సహా ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. కింద కూర్చొని పరీక్షలు రాయడం, చీకటి గదులు లేకుండా అన్ని గదుల్లో లైట్లు ఉండేలా చూస్తున్నాం.

నమస్తే: పరీక్ష పత్రాలను ఎలా తరలిస్తారు..?
డీఈవో : పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇన్విజిలేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పోలీస్ స్టేషన్లలో భద్రపరిచిన పరీక్ష పత్రాలను పోలీసు బందోబస్తు నడుమ కేంద్రాలకు తరలిస్తాం. కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్లు వాడకుండా ఆదేశాలు ఇచ్చాం. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులు కూడా నెట్ కనెక్షన్ లేని సాధారణ ఫోన్లు మాత్రమే వినియోగించాలని సూచించాం. నిబంధనలకు విరుద్ధంగా ఏ ఒ క్కరూ వ్యవహరించినా చర్యలు తీసుకుంటాం. ప్రతీ ఒక్కరూ గుర్తింపుకార్డుతో పరీక్ష విధులకు హాజరుకావాలి.

నమస్తే: సమయానికి సంబంధించి..?
డీఈవో : పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగనుండగా, పరీక్షా ప్రారంభ మైన 5 నిమిషాల వరకే అనుమతి ఇచ్చింది. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే చేరుకోవాలి. సెంటర్ల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అలాగే జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించాం.

నమస్తే: ఇంగ్ల్లిష్-2 పరీక్ష వాయిదా ఎందుకు..?
డీఈవో : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణీత షెడ్యూల్‌లో ప్రకటించిన విధంగా మార్చి 22న జరగాల్సిన ఇంగ్లిష్-2ను ఏప్రిల్ 3న నిర్వహిస్తాం. విద్యార్థులు తమ గ్రామాల నుంచి పరీక్ష కేంద్రం వరకు ఆర్టీసీ బస్సులో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

నమస్తే: అనుమతించే వస్తువులేంటే..?
డీఈవో : హాల్‌టికెట్, పెన్నులు, పరీక్ష ప్యాడ్, జామెట్రిక్ బాక్స్‌తో కేంద్రంలోకి రావాలి తప్ప ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తేకూడదు. విద్యాశాఖ వెబ్‌సెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుంది.

నమస్తే : మాస్ కాపీయింగ్‌కు బాధ్యుడు..?
డీఈవో : ప్రతీ గదిలో ఇన్విజిలేటర్ నుంచి స్వీయ ధ్రువీకర ణ పత్రం తీసుకుంటాం. తమకు సంబంధించిన వారు ఎవరూ పరీక్ష కేంద్రంలో లేరని నిర్ధారించుకుంటాం. ఎవరైనా విద్యార్థి మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే వారినే బాధ్యులను చేస్తాం.

నమస్తే: స్కూల్ యూనిఫాం ఉంటే అనుమతించరా..?
డీఈవో : టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులు ఆయా పాఠశాలల స్కూల్ డ్రెస్ (యునిఫాం) వేసుకొని వస్తే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులంతా తప్పనిసరి సివిల్ డ్రెస్‌లోనే పరీక్షలకు హాజరుకావాలి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ప రీక్ష ఉంటుంది. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రం అడ్రస్‌ను తెలుసుకొని ముందస్తుగానే చేరుకుంటే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చు.


67
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles