లోక్‌సభ వార్ వన్‌సైడే..

Sat,March 16, 2019 01:32 AM

తొర్రూరు, నమస్తే తెంగాణ, మార్చి 15 : పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో వార్ వన్‌సైడ్‌గా అన్నట్లుగా జరగనున్నాయ ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి, తెంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రజలంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ విజ్ఞత ఉన్న కాంగ్రెస్, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వ స్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయా ల్లో చక్రం తిప్పేలా తయారు కావాలని ప్రతితిపక్ష నాయకులు కూడా కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలో అణు ఒప్పంద సమయంలో ప్రభుత్వ తీర్మాణం వీగిపోకుండా కాంగ్రెస్ నేతలు టీడీపీ ఎంపీలను ఎందుకు కొన్నారు? స్వరాష్ట్ర కాంక్షతో ప్రజల అభీష్టానికి తగినట్టు పోరాటం చేసి టీఆర్‌ఎస్ పక్షాన విజయం సాధించిన ఎమ్మెల్యేలను నాడు కాంగ్రెస్‌లోకి ఎందుకు తీసుకున్నారు?, పార్లమెంట్ వ్యవస్థలో యూపీఏ హయాంలో క్రాస్‌ఓటింగ్‌లు జరిగిన వ్యవహారాలకు ఉసిగొల్పిన కాంగ్రెస్ పెద్దలకు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా అంటూ మంత్రి ప్రశ్నించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తిగా ఎ దుగుతున్న తరుణంలో బీజీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దక్కించుకునే అవకాశాలు లేవని చెప్పారు. ప్రజలంతా ఏకమై 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌కు అందిస్తే కేసీఆర్ మద్దతు తెలిపిన వారే ప్రధాని అవుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణలో మాత్రం ఒక ప్రాజెక్ట్‌కు నిధులు సమకూర్చలేదని ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలంటే తెలంగాణలో 16 ఎంపీ సీట్లను టీఆర్‌ఎస్‌కు అందించాలని మంత్రి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులంతా సమాయత్తం కావాలని మంత్రి ఎర్రబెల్లి న్నారు. వరంగల్ పార్లమెంట్‌లో 5లక్షలు, మహబూబాబాద్ పార్లమెంట్‌లో 2లక్షల ఓట్ల మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ప్రణాళికంగా ముందుకు వెళ్తున్నామని, అన్ని పార్టీల మద్దతు తీసుకుని మెజార్టీ సాధిస్తామని ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజార్టీని అందించేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నామని, ప్రజలందరి సహకారంతో ఈ టార్గెట్‌ను చేరుకుంటామన్నారు. ప్రతీ వారం పాలకుర్తి, తొర్రూ రు కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. తొలి ఆరు నెలల్లో సాగునీరు తెస్తానని చెప్పిన విధంగానే ప్రణాళికను అమలు చేస్తున్నామని ఎన్నికల కోడ్ కారణంగా పనుల పురోగతిలో కొంత అలస్యం జరుగుతున్నాయని వెల్లడించారు. నిర్ధిష్ట గడువులో లక్ష్యాన్ని చేరుకొని, అన్ని ప్రాం తాలకు స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామన్నారు.

ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు
పాలకుర్తి రూరల్ మార్చి 15: రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం మండల కేంద్రంలోని మంత్రి క్యాంప్ కా ర్యాలయంలో వార్డు సభ్యురాలు భూక్య మల్లేశ్ సరితతోపాటు సుమారు 30 మంది కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఆనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తన గెలుపు కోసం అహర్నిశలూ కృషి చే సిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. రాబోయే పార్లమెం ట్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజక వర్గం నుంచి లక్ష మెజారిటీ అందించాలని కార్యకర్తలకు సూ చించారు. వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను భారీమెజారిటీతో గెలిపించా లన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరి జలాలతో పాలకుర్తి నియోజక వర్గంలోని ప్రతీ చెరువును నింపుతానని హామీ ఇచ్చారు. చెరు వులను నింపి, రైతులను ఆదుకునేందుకు గోదావరి జలాలను విడుదల చేశానని చెప్పారు. కార్య క్రమంలో ముత్తారం సర్పంచ్ కల్వల భాస్కర్‌రెడ్డి, భూమ వెంకటయ్య, కర్ర రవీందర్, చింత కింది ఉపేందర్, నమిలిపురి రాజు, వీరన్న, వెన్నమనేని మురళీధర్‌రావు, స్వామి పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles