పకడ్బందీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నిర్వహణ

Sat,March 16, 2019 01:32 AM

- కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 15 : జిల్లా పరిధిలోని ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలో జరిగే అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి వ్యవహరించాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌వో శంకర్, డీఆర్‌డీవో జీ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేసవి జాగ్రత్త చర్యలపై సమీక్ష
వేసవి మొదలైన దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ శుక్రవారం వివిధ జిల్లా శాఖల అధికారులతో సమీక్షించారు. ఎండాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై మండలాల వారీగా గ్రామసభలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పశు సంపదను రక్షించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఆరోగ్యపరంగా తలెత్తే అంశాలను కూడా ఆయన సమీక్షించారు. సమీక్షలో డీఎంహెచ్‌వో మహేందర్, పశుసంవర్ధకశాఖ అధికారి భిక్షపతి పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles