మళ్లీ ఎలుగుబంటి పంజా..

Sat,March 16, 2019 01:32 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్ : స్టేషన్‌ఘన్‌పూర్ మండల శివారులోని ఇందిరానగర్ కాలనీ సమీపంలో మండల కేంద్రానికి చెందిన చింత వెంకటయ్య మొక్కజొన్న చేనులో శుక్రవారం మధ్యాహ్నం ఎలుగుబంటి దాడిచేసిన సంఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందిరానగర్ కాలనీ వాసుల కథనం ప్రకారం.. మండల శివారు ఇందిరానగర్ కాలనీకి సమీపంలో చింత వెంకటస్వామికి చెందిన మొక్కజొన్న చేను ఉంది. ఎప్పటి లాగానే రైతులు పొలాల్లో పనులు చేస్తుండగా దారితప్పి వచ్చిన ఎలుగుబంటి చేనులోకి దూరింది. అప్పటికికే చేనుకు నీళ్లు పెడుతున్న చింత వెంకటయ్య ఎలుగుబంటిని చూసి కేకలు వేస్తూ పరుగులు తీశాడు. గమనించిన తోటి రైతులు కూడా వెళ్లి ఎలుగుబంటిని బంధించడానికి ప్రయత్నంచేశారు. ఈక్రమంలో ఎలుగుబంటి చేసిన దాడిలో ఇందిరానగర్ కాలనీకి చెందిన రైతులు భాస్కుల నిఖిల్, చింత రాజుకుమార్, తాటికొండ రాజు(రజాక్), మునిగెల రాజుపై దాడిచేసి గాయపర్చింది. కాగా సమాచారం తెలుసుకున్న వరంగల్ జిల్లా ఫారెస్ట్ రెస్క్యూ సిబ్బంది సుధాకర్ ఎలుగుబంటిని బంధించడానికి ప్రయత్నించగా, అతడిపై కూడా దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన శంకర్‌ను 108లో ఎంజీఎంకు తరలించారు.

స్వల్పంగా గాయపడిన రైతులు భాస్కర్, నిఖిల్, రాజుకుమార్, రాజు(రజాక్), వెంకటయ్యను స్థానిక యూపీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వారిని కూడా ఎంజీఎంకు తరలించినట్లు యూపీహెచ్‌సీ డాక్టర్ ప్రసన్నకుమార్ తెలిపారు. ఇదిలాఉండగా ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తమై మత్తు సూది ని ఇవ్వడంతో ఎలుగుబంటి కిందపడిపోయింది. కాగా ఆగ్రహించిన రైతులు కర్రలతో ఎలుగుబంటిని చంపేశారు.

బాధితులకు పరామర్శ
రైతులపై ఎలుగుబంటి దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న సర్పంచ్ తాటికొండ సురేశ్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు బాధితులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఉపసర్పంచ్ నీలయ్య, ఎంపీటీసీలు ఉపేందర్, దయాకర్, నాయకులు భరత్‌కుమార్, మాతంగి దేవయ్య, చింత శ్రీనివాస్, తాటికొండ ప్రవీణ్, తాటికొండ నరేశ్, చెరిపల్లి రామల్లు, జిల్లా అశోక్, చింత నవీన్ పాల్గొన్నారు.

భయాందోళనలో ప్రజలు
స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ : ఎలుగుబంటి వరుసగా దాడులు చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. ఇప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూర్ మండలంలోని రాజవరం, కృష్జాజిగూడెం గ్రామాల్లో వరుస దాడులు గ్రామస్తులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కాగా ఇలాంటి దాడుల వల్ల రాత్రి పంటపొలాల వద్దకు వెళ్లాలంటేనే తాము భయంతో వణికిపోతున్నామని రైతులలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

51
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles