అందరూ ఉండి అనాథలా..

Sat,March 16, 2019 01:32 AM

జనగామ టౌన్ : అయిన వాళ్లు అందరూ ఉండి కూడా ఓ వృద్ధురాలు అనాథలా మిగిలిపోయింది. కుటుంబసభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏకాకిగా మారింది. జనగామ పట్టణంలోని కుర్మవాడకు చెందిన బీ సిద్ధమ్మ(80)ను తన బంధువులు అనారోగ్యం బారిన పడటంతో ఈనెల 6వ తేదీ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పుడే వస్తామని అక్కడి సిబ్బందికి చెప్పి ఆస్పత్రిలోనే వదిలివెళ్లారు. దీంతో జిల్లా ఆస్పత్రి వైద్యబృందం వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్చుకుని భోజనం అందించడంతో పాటు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కాగా నేటికి 11 రోజులైనా సిద్ధమ్మ తరుపున బంధువులు ఎవరూ ఆస్పత్రికి రాకపోవడంతో సిద్ధమ్మ కాలకృత్యాలకు వెళ్లాలన్నా లేచి నడువలేని పరిస్థితిలో ఉండటంతో ప్రస్తతం ఆస్పత్రి శానిటేషన్ సిబ్బంది దగ్గరుండి చూసుకుంటున్నారని తెలిపారు. కాగా నేడు ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ రఘు.. వృద్ధురాలు సిద్ధమ్మ పరిస్థితిపై పోలీసులకు సమాచారం అందించి వృద్ధురాలని వరంగల్ ఎంజీఎంకు తరలిస్తామని తెలిపారు. కావున వృద్ధురాలికి చెందిన బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే జిల్లా ఆస్పత్రికి వెళ్లి ఇంటికి తెచ్చుకోవాలని సూచించారు. లేదంటే వరంగల్‌కు తరలిస్తామని పేర్కొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles