పక్కా ప్రణాళికతో లోక్‌సభ ఎన్నికలు

Fri,March 15, 2019 12:45 AM

స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తే తెలంగాణ, మార్చి14 : లోక్‌సభ ఎన్నికలను పక్కా ప్రణాళికలతో నిర్వహించాలని సెక్టోరియల్, మాస్టర్ ట్రైనింగ్ అధికారులకు సహాయ ఎన్నికల అధికారి ఎల్ రమేశ్ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్కో సెక్టోరల్ అధికారికి 8 నుంచి 10 పోలింగ్ స్టేషన్లను కేటాయిస్తామని, ఆయా కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. తాగునీరు, విద్యుత్, ర్యాంపుల ఏర్పాట్లు, వీల్‌చైర్లు ఉండేలా చూడలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6గంటల వరకే ఈవీఎం, వీవీప్యాట్‌లను అందుబాటులో ఉంచాలని, పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను ఎలా భద్రపర్చాలో వివరించారు. ఎన్నికల ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించేలా పోలింగ్ సిబ్బందికి అర్థమయ్యేలా వివరించాలని సెక్టోరియల్ అధికారులకు సూచించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను పార్టీకి ఒకరు చొప్పున, అభ్యర్థులను అనుమతించే విషయంపై చర్చించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి నిర్వహించాల్సిన విధులు, పొరపాట్లు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఈవీఎం, వీవీప్యాట్, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్‌లకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని లోక్‌సభ ఎన్నికలు-2019 సమర్థవంతంగా నిర్వహించాలని, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్‌లు, ఎం-3 ఉండగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఎం-2 రకమైన యంత్రాలను వినియోగిస్తున్నామని వెల్లడించారు. వీటి వినియోగంపై మాస్టర్ ట్రైనర్‌ల ద్వారా ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తామని, ఓటర్లకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు శ్రీనివాస్‌రావు, తిరుమలచారి, రజిని, జ్యోతి, వీరప్రకాశ్, మాస్టర్ ట్రైనర్లు అడికె సతీష్, శ్రీనివాస్, డీటీలు జయచందర్, శంకర్, వీఆర్వో రాజయ్య, శ్రీకాంత్, సంతోషి, వీఆర్‌ఏలు వెలిశాల రాము, గొడుగు అనిల్, అభి, మైపాల్‌రెడ్డి, సాయి, వివిధ మండలాల సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles