గీత దాటితే చర్యలే..

Fri,March 15, 2019 12:45 AM

-యజమానులు సెట్‌బ్యాక్ కావాలి
-కొలతల్లో తేడాలుంటే నిర్మాణాలను కూల్చివేస్తాం
-నెహ్రూపార్కు-బస్టాండ్ రోడ్డులో విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్ వినయ్‌కృష్ణ
జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 14 : జనగామ జిల్లా కేంద్రం సుందరీకరణలో భా గంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలు, కూడళ్లలో జరుగుతున్న విస్తరణ పనుల్లో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఇచ్చిన మార్కింగ్ గీత దాటి నిర్మాణాలు చేపట్టే యజమానులపై చర్య లు తప్పవని కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. బస్టాండ్ చౌరస్తా జంక్షన్ నుంచి నె హ్రూపార్కు, పోలీస్‌స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులు, రైల్వేస్టేషన్ జంక్షన్‌ను 50 ఫీట్ల విస్తరణ కోసం చేసిన మార్కింగ్‌లో కొన్ని చోట్ల తేడాలు వచ్చాయని, మరికొన్ని చోట్ల కూల్చివేతలు, మళ్లీ కొత్త నిర్మాణాల్లో సం బంధిత అధికారులతో కుమ్మక్కై కొలతల్లో తే డాలు చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీనిపై గురువారం ఆయన స్పందించారు. నెహ్రూపార్కు, బాలాజీ స్వీట్ హౌస్, డీసీపీ కార్యాలయం వరకు పలుచోట్ల రోడ్డును ఇరువైపులా దగ్గరుండి కొలతలు వేయించారు. నిర్దేశిత మార్కింగ్, మాస్టర్‌ప్లాన్ రోడ్డుకు అనుగుణంగా చేసిన కొలతల మేరకు మాత్రమే యజమానులు కూల్చివేతలు చేసుకోవాలని సూచించారు. మార్కింగ్ వరకు ప్రభుత్వ రోడ్డుగా పరిగణిస్తామని, మార్కింగ్ లోపల మాత్రమే సెట్‌బ్యాక్‌తో మెట్లు, ఇతరత్రా నిర్మాణాలు చేసుకోవాలి తప్ప ఏ మాత్రం తేడా వచ్చినా, నిర్మాణాలు జరిపినా మళ్లీ కొలతలు వేసి కూల్చివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రవీందర్, డీఈ రవికిరణ్, సానిటరీ ఇన్స్‌పెక్టర్ భిక్షపతి, టౌన్‌ప్లానింగ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles