పకడ్బందీగా ప్రభుత్వ పథకాలు

Fri,March 15, 2019 12:44 AM

-కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం
జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 14 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లాలో అమలవుతున్న తెలంగాణకు హరితహారం, ఆసరా పింఛన్లు.. తదితర అంశాలపై సమీక్షించారు. హరితహారంలో భాగంగా జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం, ప్రగతిపై కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, వ్యర్ధాల నిర్వహణ, ప్రగతిపై సమీక్షించారు. ఆసరా పింఛన్లలో భాగంగా కొత్తగా గుర్తించిన లబ్ధిదారుల అంశం, భూరికార్డుల ప్రక్షాళనలో జరుగుతున్న పనులు, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఆయన అడిగి తెసుకున్నారు. ఈ సందర్భంగా అవసరమైన సూచనలు చేశారు. కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్, డీఆర్‌డీవో జీ రాంరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles