పకడ్బందీగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణ

Sat,February 23, 2019 02:45 AM

-కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి
-ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై నిర్వహణపైఅధికారులు, సిబ్బందికి మాక్‌పోలింగ్
జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 22 : అసెంబ్లీ ఎన్నికలను విజయవంతం చేసిన తరహాలోనే త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో శుక్రవారం లోక్‌సభ ఎన్నికలకు వినియోగించే వీఎంఎంలు, వీవీప్యాట్ యంత్రాలపై ఎన్నికల విధుల్లో పాల్గొనే వివిధ స్టేజీల అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం, మాక్‌పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, ఏ చిన్న పొరపాటు, సమస్యకు తావులేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాస్థాయి మాస్టర్ ట్రైయినర్ రామరాజు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలింగ్ యంత్రాల పనితీరుపై అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో ముందుగా నిర్వహించే మాక్ పోలింగ్, తర్వాత వాటిని ఎలా క్లియర్ చేయాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి కేఆర్ లత, డీఆర్‌డీవో సంపత్‌రావు, డీఎస్‌డీవో గట్టుమల్లు, హౌసింగ్ ఈఈ దామోదర్‌రావు, డీడబ్ల్యూవో పద్మజారమణ, డీపీఆర్‌వో ప్రేమలత, జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles