2న మంత్రి ఎర్రబెల్లికి అభినందన సభ

Sat,February 23, 2019 02:44 AM

-హాజరుకానున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-ఘనస్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ శ్రేణుల ఏర్పాటు
వరంగల్ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ : రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 2వ తేదీన ఆయనకు వరంగల్‌లో అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హాజరుకానున్నారు. శుక్రవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ముఖ్యులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారితో పలు అంశాలపై చర్చించారు. ఇందులో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, రాజయ్య, రెడ్యానాయక్, సతీశ్‌కుమార్, ఎంపీ దయాకర్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్‌ఎస్ జిల్లా ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles