డీజీపీని కలిసిన విష్ణు

Sat,February 23, 2019 02:44 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్, ఫిబ్రవరి 22 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసిన తనను చంపుతానని ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని మండలంలోని శివునిపల్లికి చెందిన బూర్ల విష్ణు డీజీపీ మహేందర్‌రెడ్డిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని శివునిపల్లి గ్రామాన్ని ఎస్టీకి రిజర్వు చేశారని, సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులకు ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఎన్నిక నిలిచిపోయిందని అందులో వివరించారు. ఇటీవల మరోసారి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ నెల 16న 8వ వార్డును బీసీ జనరల్‌కు కేటాయించగా తాను నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. ఇదే వార్డుకు మరో అభ్యర్థి నామినేషన్ వేసినప్పటికీ పరిశీలనలో తిరస్కరణకు గురైందని, దీంతో తాను వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని తెలిపారు. అయితే గ్రామానికి చెందిన బూర్ల శంకర్ అనే వ్యక్తి తనను మా మాట వినకుండా నామినేషన్ ఎందుకు వేశావని తనతోపాటు కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తనకు తగిన న్యాయం చేయాలని డీజీపీని వినతిపత్రంలో వేడుకున్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles