గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం

Thu,February 21, 2019 02:46 AM

-ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
-నూతన సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు
-పాల్గొన్న కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి

జనగామ టౌన్, ఫిబ్రవరి 20 : నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏకశిల కళాశాలలో పంచాయతీరాజ్ గ్రామీణా అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుంచి మార్చి09 వరకు నిర్వహించనున్న శిక్షణా తరగతులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ సహకారంతో జనగామ నియోజకవర్గంలోని ప్రతీ చెరువును నింపుకుని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలిచిందని అన్నారు. కాగా, తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 300 యూనిట్ల రక్తాన్ని సేకరించడం గొప్ప విషయమని ముత్తిరెడ్డి అన్నారు. ఇదేస్ఫూర్తితో సర్పంచ్‌లు ముందుగా గ్రామంలో పిచ్చిమొక్కలను తొలగించి వాటి స్థానంలో హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మొక్కలను కాపాడే బాధ్యతలను ఒక లక్ష్యంగా తీసుకోవాలని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీలలో డంపింగ్‌యార్డులు, నర్సరీలను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం గ్రామంలో ఏ ఒక్క పని చేసినా ఆపనికి దగ్గట్టుగా నిధులను ఆన్‌లైన్ సిష్టం ద్వారా విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.

ఇందులో అక్రమాలకు పాల్పడే అవకాశాలు లేకుండా పోనున్నట్లు తెలిపారు. ఇంతకు ముందున్నచట్టంలో ప్రజల లబ్ధికంటే అక్రమాలు అధికంగా జరిగన నేపథ్యంలో స్వరాష్టంలో ప్రజల ముంగిటకు మెరుగైన బంగారు తెలంగాణ పాలన అందించాలని సీఎం కేసీఆర్ ఈ నూతన చట్ట సవరణ చేశారని తెలిపారు. సర్పంచ్‌లు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో ప్రతి నెలా గ్రామ సమీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమాలు అందుతున్నాయ...? లేవా..? గ్రామ అభివృద్ధికి కావాల్పిన అంశాలను చర్చించుకునే వీలు కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం ద్వారా ప్రజలకు గ్రామ పంచాయతీలకు లబ్ధి జరిగే అంశాలను వివరించారు. ఈ శిక్షణ శిబిరంలో పంచాయతీరాజ్‌శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా కోర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, కే సురేశ్‌రెడ్డి, ఎండీ అప్జల్, రాజ్‌కుమార్, దస్తగిరి, సుజాత, సతీశ్‌రెడ్డి, వెంకట్, కోనేటి స్వామి, బాల్‌రెడ్డి, కిరణ్‌నాయక్, శారద, నిర్మల, శ్రీలత, విజయ, దివ్యరెడ్డితోపాటు గుండాల, జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన సర్పంచ్‌లతోపాటు జిల్లా డీపీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles