పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లకు భారీ జరిమానా

Thu,February 21, 2019 02:44 AM

జనగామ టౌన్, ఫిబ్రవరి 20 : పరిశుభ్రతలు పాటించని పలు రెస్టారెంట్లకు, ఓ బేకరీకి ఆహార భద్రత అధికారులు భారీ స్థాయిలో జరిమానాలు విధించినట్లు జిల్లా ఆహార భద్రత అధికారి జ్యోతిర్మయి తెలిపారు. కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఆహారభద్రత జిల్లా అధికారి జ్యోతిర్మయి బుధవారం జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు అధికారులు నిర్వహించిన తనిఖీలను ఉద్దేశించి ఫుడ్ సెక్యూరిటీ అధికారి జ్యోతిర్మయి విలేఖరులతో మాట్లాడారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు, ఫుడ్‌సెంటర్ల యాజమాన్యాలు తప్పనిసరిగా మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్‌తోపాటు ఫుడ్‌లైసెన్స్‌లు పొందాలన్నారు. ఆహార పదార్థాల తయారీపై యజమానులు, రోడ్లపై, ఫుట్ పాత్‌లపై తినుబండారాలు విక్రయించే చిరువ్యాపారులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. జిలా ్లకేంద్రం లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారులు జరిపిన తనిఖీలలో వివిధ రకాల రంగులతో తయారు చేసిన ఆహార పదార్థాలతో పాటు పరిశుభ్రతలో లోపాలున్నట్లు వెలుగుచూశారయని తెలిపారు.

వాటి ఆధారంగానే నిబంధనలు పాటించని కారణంగా అమృతా బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.10వేలు, భువన బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.5వేలు, వినాయక బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.10 వేలు, బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.10 వేలు, క్వాలిటీ బేకరీకి రూ.5 వేల జరిమానా విధించినట్లు ఎఫ్‌ఎస్‌వో తెలిపారు. అలాగే ప్రతి హోటల్ నిర్వాహకులు హోటళ్లలో పని చేస్తున్న వర్కర్స్ మెడికల్ సర్టిఫికెట్ తప్పకుండా కలిగి ఉండాలని ఆదేశించారు. కిరాణ, సూపర్ మార్కెట్ వ్యాపారులు తమ అమ్మకాలపై రికార్డులను మెయింటన్ చేయాలని, వాటి ఆధారంగా ఎక్కడైనా తప్పులు జరిగితే అసలు వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ తనిఖీలలో జనగామ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కృష్ణప్రసాద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles