ఏసీబీ వలలో జేసీ క్యాంపు క్లర్క్


Thu,February 21, 2019 02:44 AM

జయశంకర్ జిల్లా ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ భూపాలపల్లిలోని కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత వద్ద క్యాంపు క్లర్క్ (సీసీ)గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి తాజొద్దీన్ బరితెగించాడు. జాయింట్ కలెక్టర్ చాంబర్ ఎదురుగా ఉన్న తన ఆఫీసు గదిలో రూ.45 వే ల లంచం పుచ్చుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికాడు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం కలిగించింది.


-వివరాల్లోకి వెళ్తే..
ములుగు మండలంలోని జాకారం వద్ద గత సెప్టెంబర్‌లో పోలీసులు 162 క్వింటాళ్ల బియ్యంతో ఒక లారీని పట్టుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి సివిల్ సప్లయి అధికారులకు అప్పగించారు. ములుగుకు చెందిన వ్యాపారితోపాటు వరంగల్ ఎల్బీనగర్‌కు చెందిన జన్ను అనిల్‌పై కేసు నమోదు చేశారు. పట్టుబడిన లారీతోపాటు బి య్యం విడుదల కోసం జన్ను అనిల్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆర్డర్ ప్రకారం రూ.1.50 లక్షల బ్యాంక్ గ్యారెంటీ అందజేయడంతో అధికారులు నవంబర్‌లో లారీని వదిలిపెట్టారు. 162 క్వింటాళ్ల బియ్యం నిల్వలు అధికారుల ఆధీనంలోనే ఉండిపోయాయి. కోర్టు ఆర్డర్ ప్రకారం 162 క్వింటాళ్ల బియ్యాన్ని కూడా విడుదల చే యాలని అనిల్ సంబంధిత అధికారులను కోరాడు. కొద్ది రోజుల క్రితం దీనిపై జాయింట్ కలెక్టర్ స్వర్ణలతను కలిశాడు. ఈ బియ్యానికి సంబంధించిన దస్ర్తాన్ని సివిల్ స ప్లయి అధికారులు జేసీకి అందజేశారు. ఆ తర్వాత జన్ను అనిల్, క్యాంపు క్లర్క్ తాజొద్దీన్ మ ధ్య చర్చలు మొదలయ్యాయి. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. సీసీ తాజొద్దీన్ రూ.లక్ష డిమాండ్ చేశాడు. అంత ముట్టజెప్పడం తన వల్ల కాదని అనిల్ పేర్కొనడం తో తాజొద్దీన్ రూ.50 వేలకు తగ్గాడు. చివరకు సీసీ తాజొద్దీన్‌కు జన్ను అనిల్ రూ.45 వేలు నగదు ఇచ్చేలా డీల్ కుదిరింది. ఎన్నికల కోడ్ ఉందంటూ నవంబర్ నుం చి తిప్పుకోవడం, తర్వాత లంచం డిమాండ్ చేయడం తో జన్ను అనిల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తనకు, సీసీ తాజొద్దీన్‌కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డులను కూడా అతడు ఏసీబీ అధికారులకు అందజేసినట్లు తెలిసింది. అనిల్ తమకు అందజేసిన ఆధారాల ను పరిశీలించిన ఏసీబీ అధికారులు వాస్తవముందని ని ర్ధారించుకున్న తర్వాత రంగంలోకి దిగారు.

-అనుమానాల వెల్లువ..
క్యాంపు క్లర్క్ తాజొద్దీన్ రూ.45 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడంపై అనుమానాలు వెల్లువెత్తాయి. తాజొద్దీన్ తన కోసమే రూ.45 వేల లం చం పుచ్చుకున్నాడా?, లేక అధికారుల కోసం తీసుకున్నాడా? అనే అంశంపై చర్చ నడుస్తోంది. అధికారులకు తెలియకుండా ఒక సీసీ రూ.45 వేల లంచం తీసుకునే సాహసం చేస్తాడా? అనేది సర్వత్రా చర్చనీయమైంది. సీసీ తాజొద్దీన్‌ను పట్టుకున్న తమ బృందానికి నేతృత్వం వహించిన ఏసీబీ వరంగల్ డీఎస్పీ భద్రయ్య మీడియా తో మాట్లాడారు. సీసీ తాజొద్దీన్‌ను అరెస్టు చేశామని, గు రువారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు ప ర్చుతామని అన్నారు. అయితే జన్ను అనిల్‌ను సీసీ తా జొద్దీన్ అధికారుల పేరు చెప్పి లంచం అడిగినట్లు డీఎస్పీ భద్రయ్య వెల్లడించారు. ఈమేరకు ఏసీబీ అధికారుల వ ద్ద బలమైన ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏ సీబీ డీఎస్పీ భద్రయ్యతోపాటు ఇన్‌స్పెక్టర్లు సతీశ్, క్రాంతికుమార్, వెంకట్ తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారు. మొత్తానికి ఈ సంఘటనతో ఒకరిద్దరిపై ప్రభుత్వం వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

96

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles