ఎర్రబెల్లికి శుభాకాంక్షల వెల్లువ


Thu,February 21, 2019 02:44 AM

జనగామ టౌన్: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నేతలు బుధవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి, ఘనంగా సత్కరించారు. మం త్రిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకు లు నాగపురి కిరణ్‌కుమార్, జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ గా డిపెల్లి ప్రేమలతారెడ్డి, జనగామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షు డు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్యతోపాటు జిల్లా నాయకులున్నారు.


దేవరుప్పుల: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును బుధవారం దేవరుప్పుల మండల టీఆర్‌ఎస్ యూ త్ సభ్యులు హైదరాబాద్‌లో కలిశారు. పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. మం త్రిని కలిసిన వారిలో వడ్లకొండ వినయ్, కొమ్ము సాయి, భరత్, మేడ వెంకట్, సతీశ్, రమేశ్ త దితరులున్నారు.

కొడకండ్ల: పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పం చాయతీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ ఇంజినీర్లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రబెల్లిని కలిసిన వారిలో ని యోజికవర్గ ఇంజినీర్ల సంఘం నాయకుడు కిరణ్‌కుమా ర్, పీఆర్ ఇంజినీర్ల సంఘం నాయకులు యుగేందర్, పాషా, సురేశ్ తదితరులున్నారు.

-టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు
స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తేతెలంగాణ: రాష్ట్ర పంచాయతీరాజ్‌శా ఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు పదవీ బాధ్యతలు స్వీకరించడంపై టీఆర్‌ఎస్ నాయకులు హ ర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మండలంలోని తానేదర్‌పల్లి గ్రామంలో బుధవారం రాత్రి టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాచర్ల గణేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు చల్లా చందర్‌రెడ్డి, మాచర్ల రఘురాములు, చుక్క రమేశ్, అనిల్‌రెడ్డి, మేకల ప్రవీణ్, రాజ్‌రెడ్డి, రంజి త్, బాలరెడ్డి, సారయ్య, గాదె బాబు, ప్రణయ్‌భాస్కర్, పురుషోత్తం, భిక్షపతి, ప్రసాద్ పాల్గొన్నారు.

131

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles