రిజర్వాయర్ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి

Thu,February 21, 2019 02:42 AM

-స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవో రమేశ్
-మల్కాపూర్ ్రగ్రామస్తులతో సమావేశం
స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 20 : చిల్పూర్ మండలంలోని లింగంపల్లి-మల్కాపూర్ గ్రామాల పరిధిలో 10.78టీఎంసీల సామర్థ్యంతో కూడిన సాగునీటి రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవో రమేశ్ కోరారు. బుధవారం దేవాదుల ప్రాజెక్ట్ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డితో కలిసి ఆయన మల్కాపూర్ గ్రామంలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమేశ్ మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా చూసుకునే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా మల్కాపూర్, లింగంపల్లి గ్రామాల్లో త్వరలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతురాని తెలిపారు. ప్రజలు సహకరించాల్సిందిగా ఆర్డీవో రమేశ్ కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోలెపల్లి రంజిత్‌రెడ్డి, ఆర్‌ఐ సురేశ్‌కుమార్, స్థానిక సర్పంచ్ కొంగర రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles