అర్ధరాత్రి దొంగల బీభత్సం


Thu,February 21, 2019 02:41 AM

-ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై దాడి
-కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
జనగామ టౌన్: పట్టణంలోని జయశంకర్‌నగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. మంగళవా రం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి, నిద్రిస్తున్న యజ మానిపై బండరాయి తో దాడి చేసి, చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు ఎం నగేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజు మాదిరిగానే మం గళవారంరాత్రి నగేశ్ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తలుపులను తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశిం చారు. భార్య లేకపో వడంతో నగేశ్ ఒక్కడే ఉన్నట్లు గుర్తించిన దుండగు లు బండరాయితో నగేశ్ తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో నగేశ్ స్రృహ కోల్పోవ డంతో ఇంట్లోని సామగ్రిని చిందర వందరగా పడేసి, బీరువాలోని వస్తువులను దోచుకెళ్లినట్లు తెలిపారు. బుధవారం తెల్లవారు జామున నగేశ్ తల్లి గదికి వెళ్లి చూడగా రక్తపు మరకలతో బాధితుడు ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాయాలతో ఉన్న నగేశ్‌ను జిల్లా ప్రధాన దవాఖాకు తరలించారు. ఈ ఘటనపై వివరాలను సేకరించాలని ఏసీపీ వినోద్‌కుమార్‌ను డీసీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కాగా విచారణ అనంతరం ఈ ఘటనపై పూర్తి వివరాలను వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు.

68

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles