సమన్వయంతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చు


Sun,February 17, 2019 01:49 AM

-ఆర్టీసీ ఆర్‌ఎం సూర్యకిరణ్
జనగామ టౌన్, ఫిబ్రవరి 16 : ఆర్టీసీ లో అధికారులు , డ్రైవర్లు, కండక్టర్లు సమన్వయంతో పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ ఆర్‌ఎం పీ సూర్యకిరణ్ పిలుపునిచ్చారు. శనివారం జనగామ ఆర్టీసీ బస్ డిపోను సందర్శించిన ఆర్‌ఎం కార్మికులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ ఎం మాట్లాడుతూ ఆర్టీసీని అందరు కలిసి ప్రగతి పథంలోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ మేరకు 2018లో డిపో అభివృద్ధికి పాటుపడిన యూనియన్ నాయకులకు ఉత్తమ ప్ర శంసా పత్రాలు అందించారు. అనంతరం డిపో కార్మికుల ఆధ్వర్యంలో అమరవీరులైన భాతర జవాన్లకు కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో వరంగల్ అర్బన్ డిపో డీవీఎం రాములు, వరంగల్ రూరల్ డిపో డీవీఎం అపర్ణ కల్యాణి, జనగామ డిపో డీఎం సదాశివరావు, జనగామ డిపో సీఐ శ్రీకాంత్, ప్రసున్నలక్ష్మి, ఎల్‌ఎల్ పతి, ఎంబీకే రెడ్డి, జయరాజు, ఉపచారి, రా జు, శ్రీనివాస్, నారాయణ, సతీశ్, సోము, డిపో కార్మికులు పాల్గొన్నారు.

61

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles