టి వెలుగు@ 113రోజులు


Wed,February 13, 2019 02:03 AM

-కంజిల్లాలో ఇప్పటి వరకు 3,72,464 మందికి పరీక్షలు
-45,644 మందికి అద్దాల పంపిణీ
-శస్త్ర చికిత్సలకు 11,041 మందిని రెఫర్
జనగామ టౌన్, ఫిబ్రవరి 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు కార్యక్రమంలో జిల్లాలో 113రోజుకు చేరుకుంది. ఈ మేరకు కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. మంగళవారం 3338మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 350మందికి అద్దాలు అందజేశారు. మరో 78 మందిని శస్త్ర చికిత్సలకు రెఫర్ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 14కంటి వైద్యబృందాల ద్వారా 3,72,464 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 45,644 మందికి అద్దాలు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు అవసరమున్న 11,041 మందిని శస్త్ర చికిత్సలకు రెఫర్ చేశారు. ఇందులో 289మందికి ఇప్పటి వరకు శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు.


తాటికొండలో..
స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ : కంటివెలుగు పథకం పేదల పాలిట వరంలాంటిదని తాటికొండ సర్పంచ్ చల్లా ఉమాదేవిసుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాటికొండ గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్యక్రమాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా 200మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 38మందికి అద్దాలు అందచేశామని డాక్టర్ జీ రాము తెలిపారు. అదేవిధంగా మరో 28మందిని సర్జరీకి రెఫర్ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆప్తాల్మాజిస్ట్ సురేందర్, డీఈవో దివ్య, హెల్త్ అసిస్టెంట్ రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

1100మందికి పరీక్షలు..
పాలకుర్తి రూరల్ : మండలంలోని వల్మిడి, మల్లంపల్లి, కొండాపురం, బమ్మెర గ్రామాల్లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో 1100మందికి కంటి పరీక్షలు చేశారు. వారిలో 120మందికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. శస్త్ర చికిత్సలకు 32మందిని రెఫర్ చేసినట్లు డాక్టర్ యామిని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ్‌కిరణ్, భవానీ ప్రసాద్, సిబ్బంది రాపోలు వేణుకుమార్, సంతోష్‌కుమార్, సాల్మాన్‌రాజు, ఖయ్యూం, లత, స్వరూప, కవిత పాల్గొన్నారు.
నీర్మాలలో కంటి వెలుగు..
దేవరుప్పుల : నీర్మాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 150మంది విద్యార్థులు మంగళవారం కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో పలువురి కంటి అద్దా లు అందజేశారు. కొందరికి అవసరం మేరకు మందులు అందజేశారు. కార్యక్రమానికి వైద్యాధికారులు రమేశ్, సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి, రాజశేఖర్, రామకృష్ణ, పరుశరాములు పాల్గొన్నారు.

పెంబర్తిలో..
జనగామ రూరల్ : మండలంలోని పెంబర్తిలో గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్యశిబిరంలో మంగళవారం 251మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 22మందికి అద్దాలు పంపిణీ చేశారు. ఒకరిని కంటి ఆపరేషన్ కోసం రెఫర్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కల్పనాదేవి, ఆప్తాల్మాజిస్ట్ లిఖిత, వైద్య సిబ్బంది సుధాకర్, శ్యామ్‌సుందర్, ఆంజనేయులు, రజిత, పద్మ, కల్యాణి, ఉజ్వల, విజయ్‌కుమార్, అంజుమ్, కవిత, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

99

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles