సోషల్ మీడియాలో ఎర్రబెల్లి పై అనుచిత వ్యాఖ్యలు


Wed,February 13, 2019 02:01 AM

కాంగ్రెస్ నేత గంగుపై పోలీసులకు ఫిర్యాదు
పాలకుర్తి, ఫిబ్రవరి12: నిరంతరం ప్రజా సంక్షేమం కోసం తపన పడుతున్న పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు గంగు కృష్ణమూర్తిపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవా లని కోరుతూ మంగళవారం టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు స్థానిక పోలీస్టేషన్‌లో ఎస్సై గుండ్రాతి సతీశ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం సుధాకర్ మాట్లాడతూ ఎమ్మెల్యే దయాకర్‌రావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఎర్రబెల్లి ఫేస్ బుక్ ద్వారా ఫొటోలతో విస్తృత పరుస్తున్నారని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకుడు గంగు కృష్ణమూర్తి గత కొంత కాలంగా ఫేస్ బుక్, వాట్సఫ్‌లో అనుచిత వ్యాక్యలతో దూషణలకు పాల్పడుతున్నా డని తెలిపారు. ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. దీనిపై స్పందించిన టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు అడిగినందుకు కృష్ణమూర్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఇలాంటి వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్సైని కోరారు. బహిరంగంగా దుర్భషలాడడం వల్లే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు కమ్మగాని రమేశ్, ఎనుగందుల శ్రీనివాస్, ఏడవెల్లి పురుషోత్తం కిష్ట యాకయ్య, యాకయ్య పాల్గొన్నారు.

95

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles