నేడు ములుగుకు స్మితా సబర్వాల్

Tue,February 12, 2019 02:19 AM

-దేవాదుల ఇన్‌టేక్‌వెల్ పనులను పరిశీలించనున్న సీఎంవో ప్రత్యేకాధికారి
ములుగు ప్రతినిధి, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి 11 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించడానికి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి, నీటి పారుదల శాఖ బాధ్యులు స్మితా సబర్వాల్ మంగళవారం ములుగు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న దేవాదుల ఇన్‌టేక్‌వెల్ ప్రధాన బ్యారేజీ పనులతోపాటు పాకాల రంగాయి చెరువు ప్రాజెక్ట్ పంప్ హౌజ్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. ములుగు సమీపంలోని రంగారావుపల్లి వద్ద నిర్మిస్తున్న దేవాదుల పంప్‌హౌజ్ ప్యాకేజ్-5, రామప్ప, పాకాల ప్యాకేజీ పనులను ఆమె పరిశీలిస్తారు. ఉదయం 11:30గంటలకు ములుగు చేరుకొని 12:45 వరకు పంప్‌హౌజ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామానికి చేరుకొని ప్యాకేజీ రెండో పైప్‌లైన్ పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2:45 నుంచి 4:30 వరకు రామప్ప నుంచి ములుగు గణపురం కెనాల్ ప్యాకేజీ-3 టన్నెల్ పనులను పరిశీలిస్తారు. 4:30 నుంచి 5 గంటల వరకు కేశవాపురంలోని గ్రావిటీ కెనాల్ పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి ములుగుకు చేరుకొని హెలీకాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు స్మితా సబర్వాల్‌కు ఆయా ప్రాజెక్టుల పనుల పురోగతిపై పూర్తి సమాచారం అందించనున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగం చీఫ్ ఇంజినీర్ బంగారయ్య దేవాదుల ఇన్‌టేక్‌వెల్ పనుల పురోగతి, చేపడుతున్న విధి విధానాలను ఆమెకు వివరించనున్నారు. పర్యటనలో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధిం చిన ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ముఖ్య అధికారులు పాల్గొననున్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles