టీఆర్ సర్కార్ పల్లెల్లో ప్రగతి


Tue,January 22, 2019 02:13 AM

గుండాల: టీఆర్ సర్కార్ పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తాయని, పార్టీ బలపర్చిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ కోరారు. సోమవారం ఆమె బండ్లకొత్తపల్లి, పెద్దపడిశాల, టీశాపురం, గుండాల, సీతారాంపురంలో టీఆర్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందిస్తూ ఆదర్శవంతమైన పాలనను అందిస్తోందన్నారు. తెలంగాణలో పేద ప్రజల కోసం ఆసరా పింఛన్లు, ఆహార భద్రత కార్డులు, కల్యాణలక్ష్మి, రైతుల కోసం భూరికార్డుల ప్రక్షాళన, రైతుబంధు, రైతుబీమా వంటి గొప్ప పథకాలను అందుబాటులోకి తెచ్చి సీఎం కేసీఆర్ పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఇతర రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. నవాబుపేట రిజర్వాయర్ ద్వారా సాగునీటి కోసం దేవాదుల కాల్వ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.


త్వరలోనే మండల ప్రజలకు గోదావరి జలాలతో సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు కమ్యూనిటీ, పంచాయతీ భవనాలు నిర్మించుకోవాలంటే సమర్థులైన నాయకులు గ్రామాలకు అవసరమన్నారు. పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీఆర్ మద్దతుదారులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. కార్యక్రమంలో బండ్లకొత్తపల్లి సర్పంచ్ అభ్యర్థి గోపాల్ శారద, పెద్దపడిశాల అభ్యర్థి పాశూల నాగరాజు, తుర్కలశాపురం అభ్యర్థి జక్కుల భిక్షమయ్య, గుండాల అభ్యర్థి చిందం వరలక్ష్మి, సీతారాంపురం అభ్యర్థి మలిపెద్ది మాధవి, ఎంపీపీ సంగి వేణుగోపాల్, జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, టీఆర్ రాష్ట్ర నాయకుడు అండెం సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు బండ రమేశ్ రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ గడ్డమీది పాండరి, ఎంపీటీసీ బడక మల్లయ్య, ఇమ్మడి దశరథ, చిందం ప్రకాశ్, అన్నెపర్తి అనసూర్య, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ షర్ఫోద్దిన్, కుంచాల అంజిరెడ్డి, రాంమల్లు, ఓడపల్లి మధు, మహోదయ్, మాజీ జెడ్పీటీసీ కోలుకొండ యాదగిరి, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్ మల్లయ్య పాల్గొన్నారు.

108

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles