అభ్యర్థుల అప్పీలపై నామినేషన్ పత్రాల పరిశీలన

Tue,January 22, 2019 02:13 AM

స్టేషన్ నమస్తేతెలంగాణ జనవరి 21 : స్టేషన్ చిల్పూర్ మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు అభ్యర్థుల అప్పీలపై ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఎల్ రమేశ్ నామినేషన్ పత్రాలను పరిశీలించారు. స్టేషన్ మండలంలో 18 జీపీల పరిధిలోని సర్పంచ్ స్థానాలకు 111, 188 వార్డులకు 510 నామినేషనన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలనలో సర్పంచ్ 4, వార్డు స్థానాలకు సంబంధించి 17 నామినేషన్లను తిరస్కరించారు. చిల్పూర్ మండలంలోని 17 సర్పంచ్ స్థానాలకు 131, 168 వార్డులకు 424 నామినేషనులు దాఖలయ్యాయి. పరిశీలనలో సర్పంచ్ 6, వార్డులకు సంబంధించి 9 నామినేషన్లను తిరస్కరించారు. కాగా, తిరస్కరించిన రెండు మండలాల్లోని ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులు 11 మంది ఆర్డీవోకు అప్పీలు చేశారు. వారి విజ్ఞప్తి మేరకు సోమవారం నామినేషన్ పత్రాలను పరిశీలించారు. పరిశీలనలో స్టేషన్ మండలానికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థి ఒక్కరు, వార్డు సభ్యులకు సంబంధించి ముగ్గురి నామినేషన్లను తిరస్కరించారు. సరైన పత్రాలు, సంతకాలు లేనందున వారి నామినేషన్లను తిరస్కరించినట్లు ఆర్డీవో రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ మహబూబ్ ఆలీ, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles