గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి


Mon,January 21, 2019 01:29 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తేతెలంగాణ/కొడకండ్ల, జనవరి 20: టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ప్రజల మద్దతుతో గెలిచి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పాలకు ర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమ ణి ఉషాదయాకర్‌రావు అన్నారు. కొడకండ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి పసునూరి మధుసూదన్‌కు మద్దతుగా ఆదివారం ఉషాదయాకర్‌రావు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో టీ ఆర్‌ఎస్ అధికారంలో ఉందని, పాలకుర్తిలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి అండతో విజయం సా ధించి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కో రారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కుందూరి వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎం పీపీ పేరం రాము, గ్రామ అధ్యక్షుడు కుం దూరి అమరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆసిఫ్, మంగ్యానాయక్, కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


స్టేషన్‌ఘన్‌పూర్, చిలుపూరు మండలాలల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు విస్తృ త ప్రచారం చేస్తున్నారు. రాజవరం గ్రామం లో మారెపల్లి తిరుమల క్రిష్ణమోహన్‌రెడ్డి, లింగంపల్లి గ్రామంలో ఏదునూరి రవీందర్, ఛాగల్లు గ్రామంలో పోగుల సారంగపాణి, తాటికొండ గ్రామంలో చల్లా ఉమాదేవి సుధీర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులు ప్రభుత్వ పథకాలను గడప గడపకూ వివరి స్తూ ఓట్లు అభ్యర్థించారు. ప్రచార ఈ కార్యక్రమంలో కాల్వ క్రిష్ణారెడ్డి, బైరగోని ఎల్ల య్య, ఇమ్రాన్, బీ నాగరాజు, పీ రాజేశ్, మోతె శ్రీను, మటూరి శ్రీనివాస్, మారెపల్లి శ్యాంసుందర్‌రెడ్డి, రావుల రమణారెడ్డి, ఎడ్ల ఎల్లయ్య, బైరగొని కోటి, ఎస్ సదానందం, బుచ్చి రాజమ్మ, ముక్కెర స్వామి, బైరగోని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

103

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles