కన్నుల పండువగా కుసుమ హరనాథ లీలా కల్యాణం

Mon,January 21, 2019 01:28 AM

- పలు రాష్ర్టాల నుంచి హాజరై మొక్కులు చెల్లించుకున్న వందలాది మంది
- భక్తుల ప్రత్యేక పూజలు
జనగామ టౌన్, జనవరి 20: జిల్లా కేంద్రంలోని బాణా పురం హనుమాన్ ఆలయ ఆవరణలో కుసుమ హరనాథు ల లీలా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈనెల 19 నుంచి జరుగుతున్న కుసుమ హరనాథుల 74వ ఆనం ద మేళోత్సవంలో ఆదివారం ఉదయం ప్రభాత సేవ, జ్యో తి ప్రజ్వలన, సంకీర్తనలు, ఉపన్యాసములు, పారణాల అ నంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు కుసుమ హరనా థ లీలా కల్యాణాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన కుసుమ హరనాథ ప్రచారసంస్థ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కు సుమ హరనాథుల ప్రచార ఆనంద మేలోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ భక్తులకు స్వామి వారి జీవిత చరిత్ర తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే జనగామలో ఈ కార్యక్రమాని నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో వివి ధ రాష్ర్టాల నుంచి సుమారు మూడు వేల మంది భక్తులు పాల్గొన్నారు. వారంతా సామూహిక రక్తదానం చేయగా, సేకరించిన రక్తాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానలోని రక్తనిధి కేంద్రానికి అప్పగించామన్నారు. అనంతరం భక్తలకు మ హాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కుసుమ హరనాథ ప్రచార సంస్థ అధ్యక్షుడు కందుకూరి లింగయ్య గుప్తా, బీ శేషగిరిరావు, మధు, విజయ్‌కుమార్ బజాజ్, కృష్ణజీవన్ బజాజ్, రామకృష్ణరెడ్డి, పంకజ్‌బజాజ్, వాసు, వినోద్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles