టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు


Mon,January 21, 2019 01:28 AM

దేవరుప్పుల, జనవరి 20: మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కడవెండికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దరగాని కస్తూరిబాయికి టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు పోతిరెడ్డి లీనారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోలుకొండలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గనుపాక సోమయ్య, నర్సయ్య, మాచర్ల యాకయ్య, ఐలయ్య, మల్లయ్య, కుమార్, సుక్క చిట్టు, గనుపాక పరశురాములు, ఏసయ్య, హరీశ్, ఇల్లందుల ఏలేంద్ర, శ్రీకాంత్, గొంగళ్ల కొమురయ్య, మాచర్ల సోమయ్య, చింత భాస్కర్ టీఆర్‌ఎస్ ఎన్నికల గ్రామ ఇన్‌చార్జ్ వీరారెడ్డి దామోదర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు బోనగిరి యాకస్వామి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమాల్లో కడవెండికి చెందిన టీఆర్‌ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి బాషిపాక భిక్షపతి, మాజీ సర్పంచ్ హనుమంతు, కోలుకొండకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు కోతిపద్మ, యామగాని నాగన్న, గనుపాక నర్సయ్య, ఎల్లేశ్, కన్న రామ్మూర్తి, పాము మోహన్, గుండెకారి శ్రీనివాస్, ముత్యాల అరవింద్, మాచర్ల బాబు, చింత నరేశ్ తదితరులు ఉన్నారు.

71

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles