నేడే పోలింగ్


Mon,January 21, 2019 01:28 AM

- మొదటి విడతకు రంగం సిద్ధం
- గ్రామాలకు చేరిన ఎన్నికల సామగ్రి
- పోలీసుల పకడ్బందీ బందోబస్తు
- ఉదయం 7 గంటలకు పోలింగ్ షురూ
నర్మెట, జనవరి 20: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రంలోగా అన్ని గ్రామాల పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో సహా ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా నర్మెటలోని జెడ్పీఎస్‌ఎస్ ఆవరణలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి, పోలింగ్ అధికారులకు సామగ్రి అందజేసి పోలీస్ బందోబస్తుతో బసుల్లో గ్రామాలకు చేర్చినట్లు ఎంపీడీవో ఎం కృష్ణయ్య తెలిపారు. ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా రిటర్నింగ్ అధికారులు పని చేయాలన్నారు. పోలింగ్ బూత్‌లోకి నామినేషన్ వేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ఓటర్లను మాత్రమే అనుమతించాలని, మిగతా సమయంలో అధికారులు ఇచ్చిన ఐడీ కార్డు లేని వారికి ప్రవేశం ఉండదన్నారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ అధికారులు, రూట్ అధికారులు, అదనపు ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. వివిధ శాఖల అధికారులు, ఈవోపీఆర్డీ లత తదితరులు పాల్గొన్నారు.


గ్రామాలకు తరలిన సిబ్బంది..
బచ్చన్నపేట: మండలంలో నేడు జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సిబ్బంది ఆదివారం సాయంత్రం వరకు గ్రామాలకు తరలివెళ్లారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలో ఆర్‌వో, పీవో, ఏపీవో, ఓపీవో ఎన్నికలకు సంబంధించి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు తదితర సామగ్రితో వారికి కేటాయించిన గ్రామాలకు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కుమారస్వామి మాట్లాడుతూ ఎన్నికల సిబ్బందికి ఆ యా గ్రామాల ప్రజలు, పార్టీల నాయకులు, ఓటర్లు సహకరించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి తగిన వసతులను వీఆర్వో, గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ రొండ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈవో తేలుకంటి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
తరిగొప్పుల: గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలోని అన్ని గ్రామాలకు పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికల సిబ్బంది సామగ్రితో చేరుకున్నారు. మాన్సింగ్‌తండాకు చేరుకున్న సిబ్బంది అన్ని సిద్ధం చేసుకుని స్థానికంగా బస చేశారు. నేటి ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం అధికారుల భోజనాలు చేసిన తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా ఎస్సై భరత్ మాట్లాడుతూ పోలింగ్ జరిగే సమయంలో ఘర్షణలు, అల్లర్లకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అన్ని గ్రామాల ప్రజలు శాంతియుతంగా, స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.

65

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles