సామాజిక సేవా కార్యకర్త ఆర్ మృతి

Sun,January 20, 2019 01:32 AM

పాలకుర్తి రూరల్, జనవరి 19: సమాజ సేవే లక్ష్యం గా పని చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ సంఘ సేవకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాపాక సత్యం అలియాస్ ఆర్ (65) శనివారం చనిపోయా డు. పాలకుర్తికి చెందిన రాపాక సత్యం సెప్టెంబర్ 3, 1954లో జన్మించాడు. చాలా ఏళ్లుగా ఆర్ పలు, ప్ర భుత్వ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. సోమనాథ కళాపీఠం ఏర్పాటుతో పాటు సాహితీ కార్యక్రమాల్లో ఆయన కృషి మరువలేనిదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఇటీవల కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ శనివారం తుది శ్వాస విడిచా డు. ఆర్ మృతదేహాన్ని వరంగల్ వ్యవసాయ మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి నారాయణరావు, సోమనాథ కళాపీఠం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, టీఆర్ మండల అధ్యక్షుడు నల్లా నాగిరెడ్డి, పాలకుర్తి మార్కె ట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు ఎర్రబె ల్లి రాఘవరావు, డాక్టర్ మంద బుచ్చిరెడ్డి, గంగు కృష్ణమూర్తి, చిట్యాల రాం చంద్రం, కమ్మగాని ఆంజనేయులు, వీరమనేని యాకాంతారావు, రాపాక ఆశోక్, రాపాక సుధాకర్, కమ్మగాని రమేశ్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles