పని చేసే వారికి అవకాశమివ్వండి


Sat,January 19, 2019 01:50 AM

-టీఆర్ హయాంలోనే గ్రామాల సమగ్రాభివృద్ధి
-జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
-సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
బచ్చన్నపేట, జనవరి 18 : అభివృద్ధిని కాంక్షించే వారినే సర్పంచ్, వార్డు సభ్యులు గా ఎన్నుకోవాలని, అప్పుడే ఆయా గ్రా మాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నా రాయణపూర్, పోచన్నపేట, బచ్చన్నపేట, కట్కూర్, బండనాగారం, కేశిరెడ్డిపల్లి, చిన్నరామన్ టీఆర్ బలపర్చిన స ర్పంచ్ అభ్యర్థులు పరిదె భీమేశ్, మామిడి అరుణ, వడ్డేపల్లి మల్లారెడ్డి, నాగజ్యోతి, శి వరాత్రి కవిత, ఇమ్మడి రాధాబాయి, గు ర్రాల లలితల గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలో సమగ్రాభివృద్ది జరిగిందన్నారు. అర్హులందరికీ సం క్షేమ ఫలాలు అందాయని, అందుకే అసెం బ్లీ ఎన్నికల్లో మహా కూటమికి బుద్ధి చెప్పి తిరిగి కేసీఆర్ సీఎంగా చేశారని, అలాగే తనను ఎమ్మెల్యేగా రెండో సారి గెలిపించారని అన్నారు. అదే పట్టుదల, స్ఫూర్తితో టీ ఆర్ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆయా గ్రా మాలపై ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొ త్తంలో అభివృద్ధి పనులకు నిధులు మం జూరు చేయిస్తామన్నారు.


తరచూ పార్టీలు మారేవారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. ముప్పు ఏళ్లకు ఎండిపోయి ఎక్కిరించిన బచ్చన్నపేట గుడి చెరువును తాను కష్టపడి నింపానని గుర్తు చేశారు. ముఖ్యంగా బచ్చన్నపేట మండలాభివృద్ధికి తాను ప్రత్యేక శ్రద్ధ చూపుతానని అన్నారు. టీఆర్ చేపట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, టీడీపీల నుంచి భారీగా టీఆర్ చేరుతున్నార ని అన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వ య సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, టీఆర్ మండల అధ్యక్షుడు చం ద్రారెడ్డి, నాయకులు గందమల్ల నరేందర్, బొమ్మెన ఆంజనేయులు, ఉపేందర్ పందిపెల్లి సిద్ధ్దిరాంరెడ్డి, గోవర్దన్ మ హేందర్ ప్రకాశం, ఆనంద్, ఉప్పల య్య, జలంధర్, గంగం సతీష్ జావీ ద్, షబ్బీర్, మోహన్ కైసర్, కాశీపతి, ముశిని బాబు, శ్రీనివాస్ హరిప్రసా ద్, జితేందర్ ఉదయ్ యాకంరెడ్డి, రాజు, చల్లా సుధాకర్ మ ల్లయ్య, సిద్ధ్దారెడ్డి, సంజీవరెడ్డి, రవి, నవీన, మహేందర్ ఫిరోజ్, తుప్పతి భాస్కర్, బాలక్రిష్ణ, భూపాల్, నర్సిరెడ్డి, రాజ్, బాపురెడ్డి, మల్లారెడ్డి, జోగిరెడ్డి పాల్గొన్నారు.

106

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles