ధర్మో రక్షతి రక్షితః


Sat,January 19, 2019 01:24 AM

- నేరస్తులను పట్టుకోవడంలో ప్రజల సహకారం కీలకం
- తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ : డీసీపీ శ్రీనివాస రెడ్డి
కొడకండ్ల జనవరి 18 : ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని డీసీపీ శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మొండ్రాయి గ్రామంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ అనంతరం ఆయన మా ట్లాడుతూ.. సమాజం శాంతి యుతం గా ఉండడం కోసం పోలీస వ్యవస్థ నిరంతరం పని చేస్తుందని, ఒక తప్పు చేస్తే ఆ తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం మరో తప్పు చేయవలసి వస్తుందన్నారు. స్థానికుల సహకారం ఉంటే నేరస్తులను పట్టుకోవడం సులువవు తుందన్నారు. అపరిచితులు, కొత్త వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే 100 నంబర్ డయల్ చేయాలని సూచించారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని, నూత న సాంకేతిక పరిజ్ఞానంతోనేరస్తులను వెంటనే గుర్తిస్తున్నామన్నారు. మొం డ్రాయి గ్రామంలోని వైన్స్ షాప్ డబ్బు ల దోపిడీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో దొంగలను పట్టుకుంటామని తెలిపారు. తెలిసిన విషయం చెప్పకుండా దాచేస్తే నేరమేనని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు బైకులు ఇవ్వకూడదని సూచించారు. గత సంవత్సరంలో 121 యాక్సిడెంట్ లలో 150 మంది మరణించారని, మద్యం తాగి వాహనాలను నడుపరాదన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతీ ఇంట్లో పోలీసులు సోదా నిర్వ హించారు. కాగా, గ్రామంలో అదనం గా సీసీ కెమెరాలు, పాఠశాల ముందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రా మస్తులు కోరారు. స్పందించిన డీసీపీ ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడు తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్, సీఐ లు రమేశ్, చంద్రశేఖర్ గౌడ్, ఎస్సైలు సతీశ్, రవికుమార్, రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

110

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles