కారును ఢీ కొట్టిన జీపు

Sat,January 19, 2019 01:23 AM

-ఒకరి మృతి - పలువురికి గాయాలు
- గోవర్ధనగిరి పెట్రోల్ బంక్ సమీపంలో ఘటన
రఘునాథపల్లి, జనవరి 18 : జీపు ముందు టైరు ప్రమాదవశాత్తు ఊడిపోవడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఒకరు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గోవర్ధనగిరి పెట్రోల్ బంక్ సమీపంలో వరంగల్-హైదరాబాదు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ నుంచి జీపు ప్రయాణికులతో జనగామ వైపు వెళ్తోంది. ఈక్రమంలో గోవర్ధనగిరి పెట్రోల్ బంక్ వద్దకు రాగానే జీపు ముందు టైరు ఊడిపోయింది. దీంతో జీపు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు, జీపు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కారు డ్రైవర్ బీ తిరుపతి (44) మృతి చెందగా కారుతోపాటు జీపులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై వేణుగోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంలో గాయపడ్డ పద్మావతి, సురేష్, ఇద్దరు చిన్నారులు, సదానందం, రమేశ్, నర్సయ్య, ఎల్లమ్మలను పోలీస్ వాహనంలో జనగామ జిల్లా ఏరియా దవాఖానకు తరలించారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles