ఆదర్శ గ్రామాలు.. 10 పంచాయతీలు


Fri,January 18, 2019 01:44 AM

రఘునాథపల్లి: మండలంలోని 36 జీపీల్లో పది జీపీలు ఏకగ్రీవమయ్యాయి. పడమటిగూడెంలో మలిరెడ్డి పద్మ, పొట్టిగుబ్బడితండాలో బానోత్ జతిరాం, బాంజీపేట్‌లో గొరిగె భాగ్య, సోమయ్యకుంటతండాలో కేతావత్ పార్వతి, మాదారంలో గుడి రాంరెడ్డి, వేపలగడ్డతండాలో కొర్రం జముకు, ఎల్లారెడ్డిగూడెంలో మడికంటి మాధవి, శివాజీనగర్‌లో శివరాత్రి కొమురయ్య, అయ్యవారిగూడెంలో పార్నంది కొమురయ్య, శ్రీమన్నారాయణపురంలో చింత సుశీల సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయా గ్రామాల్లో 80 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవయ్యారు. ఈ సందర్భంగా మద్దతుదారులు సంబురాలు చేసుకున్నారు. అనంతరం నూతన సర్పంచ్‌లు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన ప్రజలు తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టా న్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తామన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు పార్టీలకతీతంగా అభివృద్ధికి సహకరించాలని కోరారు. తమ ఎన్నికకు సహకరించిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజ య్య, టీఆర్‌ఎస్ మండల, గ్రామ కమిటీల నాయకులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

121

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles