కంటి వెలుగుకు అనూహ్య స్పందన

Fri,January 18, 2019 01:43 AM

జనగామ రూరల్: జనగామ మండలంలోని చౌ డారం గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరంలో గురువారం 255 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 49 మందికి అద్దాలను అందజేయగా, 11 మందిని ఆపరేషన్ల కోసం దవాఖానకు రెఫర్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కల్పనాదేవి, ఆప్తాల్మిక్ లిఖిత, వైద్య సిబ్బం ది సుధాకర్, శ్యాంసుందర్, ఆంజనేయులు, ర జిత, పద్మ, కల్యాణి, ఉజ్వల, విజయ్‌కుమార్, ఏ ఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

బచ్చన్నపేట: మండలంలోని కొడవటూరు గ్రా మంలోని ఉన్నత పాఠశాలలో కంటివెలుగు శిబి రం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భం గా గ్రామ సర్పంచ్ గంగం సతీష్‌రెడ్డి మాట్లాడు తూ సీఎం ప్రతీ పేదవాడికి కార్పొరేట్ స్థా యిలో వైద్యం అందించడంతో పాటు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని, అవకాశాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనికోరా రు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆత్కూరి ర మేశ్, డాక్టర్ మోజెస్‌రాజ్, సిబ్బంది, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

కృష్ణాజిగూడెంలో..
స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తేతెలంగాణ: చిలుపూరు మండలంలోని కృష్ణాజిగూడెంలో మల్కాపూర్ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో కంటి వెలుగు వైద్యశిబిరం నిర్వహించగా, మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా గురువారం 290 మంది పరీక్షలు చేయంచుకోగా 25 మందికి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ భవాని ప్ర సాద్, క్యాంపు కో ఆర్డినేటర్ రాంకిషన్, సూపర్‌వైజర్ కృప, ఏఎన్‌ఎం సునంద, ఆప్తాల్మిక్ వినోద్, సిబ్బంది, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles