క్రీడలతో మానసికోల్లాసం

Fri,January 18, 2019 01:43 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ జనవరి 17 : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ రాజిరెడ్డి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఛాగల్లు గ్రామంలో స్వాగత్‌యూత్ గౌరవఅధ్యక్షుడు పోగుల సారంగపాణి ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన కబడ్డీ క్రీడలు గురువారంతో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ రాజిరెడ్డి హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రాజిరెడ్డి ఈ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. జనగామ జిల్లా జఫర్‌ఘడ్ మండలం ఒబులాపురం జట్టుకు మొదటి బహుమతి రూ.20వేలు ప్రదానం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జట్టుకు రెండో బహుమతి రూ.15వేలు, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఛాగల్లు జట్టుకు మూడో బహుమతి రూ.10వేలు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టపర్తి జట్టుకు నాలుగో బహుమతిరూ.8వేలు, వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ జట్టుకు ఐదో బహుమతి రూ.6వేలు, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి జట్టుకు ఆరో బహుమతి రూ.4వేల చొప్పున నగదు బహుమతులను అందచేశారు. అనంతరం సీఐ రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఐక్యతకు క్రీడలు దోహదపడతాయని తెలిపారు.

యువకులు క్రీడల్లో చురుగ్గా పాల్గొని తమలోని క్రీడా నైపుణ్యాన్ని చాటుకోవాలని అన్నారు. క్రీడలతో సమాజంలో గుర్తింపు లభించడంతోపాటు స్నేహబంధాలు పెంపొందుతాయని అన్నారు. విద్యార్థులు, యువకులు చదువుతోపాటు, క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. అదేవిధంగా ప్రతీ యువకుడు ఆటల్లో పోటీతత్వాన్ని అలవరుచుకోవడం ద్వారా వాటిపై పట్టుదల పెరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు ఆకుల కుమార్, మండల ఉపాధ్యక్షుడు తోట వెంక న్న, ఇనుగాల నర్సింహారెడ్డి, హిమబిందు, సుధాకర్, అన్నెపు ఐలయ్య, స్వాగత్ యూత్ అధ్యక్షుడు కూన రాజు, కార్యదర్శి అన్నెపు కుమార్, సభ్యులు రవి, సుధాకర్, తోట రమేశ్, ఇమ్రాన్, బూర్ల కుమార్, పోలీస్ సిబ్బంది కుమార్ తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles