ఆలేటి ఎల్లవ్వ జాతరకు పోటెత్తిన జనం


Thu,January 17, 2019 01:54 AM

పాలకుర్తి రూరల్, జనవరి 16 : గజ్జెల లాగు లు....నెత్తిన బోనాలు...గొల్ల, కుర్ముల జానపదుల పాటలు... డమరుకం మోతలు... శివసత్తుల పూ నకాలతో బుధవారం మండలంలోని బమ్మెర శి వారు ఎల్లమ్మ గడ్డ తండా భక్త జనంతో కిక్కిరిసి పోయింది. సంక్రాంతి పర్వదినం మరుసటి రోజు న ఎల్లమ్మ గడ్డలోని ఆలేటి ఎల్లవ్వ జాతరకు సు దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎల్లవ్వకు పట్నాలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బమ్మెర, రాఘవపురం, గూడూరు, పాలకుర్తి, అయ్యంగారిపల్లి, ఈరవె న్ను, కోతులాబాద్ గ్రామాలకు చెందిన మహిళలు బోనాలతో కాలి నడకన తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లికి సమర్పించారు.


బోనమెత్తిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దంపతులు..
పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు దంపతులు ఎల్లవ్వ తల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దంపతులిద్దరూ బోనమెత్తి భక్తులను ఉత్సాహపరిచారు. ఈ ప్రాంత రైతులను, ప్రజలను, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో చల్లగా చుడాలని ఎల్లవ్వ తల్లిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్దికి తా ను ప్రత్యేక చొరవ చూపుతానన్నారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాలు రాబోయే రోజుల్లో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతానన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో పాలకుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. గోదావరి జలాలతో చేరువులు నింపుతానని హా మీ ఇచ్చారు. ఎల్లమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎ ర్రబెల్లి దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి నారాయణరావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్లా నాగిరెడ్డి, వై ఎస్ ఎంపీపీ గూడ దామోదర్, పాలకుర్తి మార్కెట్ చైర్మన్ ముస్కు రాంబాబు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వీరమనేని యాకాంతారావు, మార్కెట్ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, టీఆర్‌ఎస్ యూత్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పసునూరి నవీన్, ఎంపీటీసీ దేవసాని కృపాకర్, బత్తిని గోపాల్, శ్రీనివాస్‌గౌడ్, జోగు గోపీ, దేవయ్య, మదన్, మాచర్ల ఎల్లయ్య, రంగినేని సత్యనారాయణరావు, వంగాల పర్శరాములు, వెన్నకూస యాకయ్య, దాసు పాల్గొన్నారు.

ఎల్లమ్మ గడ్డ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాలకుర్తి సీఐ బానో తు రమేశ్ నాయక్, ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. అవాంఛనీయం ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. వైద్య ఆరో గ్య సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు.

165

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles