ఘనంగా సంక్రాంతి సంబురాలు

Thu,January 17, 2019 01:54 AM

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 16 : జిల్లా అంతటా ప్రజలు మంగళ, బుధ వారాల్లో సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఇళ్ల ముంగిట రంగురంగు ల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు, నవ ధా న్యాలు ఉంచారు. ఇళ్లన్నీ సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. సంక్రాంతి, కనుమ పండుగల ను పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో మహిళలు సామూహికంగా నోములు, వ్రతాలు నోచుకున్నా రు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎక్కడ చూసినా పతంగులతో సందడి చేశారు. పిండి వంటలు, స్వీ ట్లు చేసుకొని ఆరగించారు. కనుమ పండుగ రోజు చాలా మంది మాంసాహారాలతో విందు చేసుకున్నారు. దీంతో మటన్, చికెన్, చేపల దుకాణాలు కిటకిటలాడాయి. బాణాపురం శ్రీ వేంకటేశ్వరాలయం, చెన్నకేశవాలయం, హనుమాన్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. కాగా, సెలవులు ముగియడంతో ప్రజలు గ్రామాల నుం చి పట్టణాలకు తిరుగు ప్రయాణమయ్యారు. జనగామ రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడాయి.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles